Coconut Oil Side Effects : కొబ్బరి నూనె అధికంగా వాడటం చర్మానికి హానికరం..! కారణాలు ఇలా ఉన్నాయి..
Coconut Oil Side Effects : చాలా మంది జుట్టు, చర్మం కోసం కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
Coconut Oil Side Effects : చాలా మంది జుట్టు, చర్మం కోసం కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. చర్మ సమస్యల నుంచి బయటపడటానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపడుతుంది. అవసరమైన పోషణను అందించి సహాయపడుతుంది. కొబ్బరి నూనె ప్రభావం వేడిగా ఉంటుంది. కనుక శీతాకాలంలో దీనిని పూయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి స్నానం చేసిన తర్వాత చేతులు, కాళ్ళు, ముఖానికి అప్లై చేస్తారు.
చాలా మంది రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను చర్మానికి పూస్తారు. వేసవిలో కొబ్బరి నూనె పూయడం ప్రయోజనకరం కానీ ఏదైనా అధికంగా వాడటం హానికరం. మీరు కొబ్బరి నూనెను ముఖం మీద ఎక్కువగా ఉపయోగిస్తే చర్మ సమస్యలు వస్తాయి. కొబ్బరి నూనె జుట్టును బలంగా చేయడానికి, పెరగడానికి సహాయపడుతుందని అందరికి తెలుసు. రాత్రి పడుకునే ముందు అధిక మొత్తంలో నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుదల సమస్యలు వస్తాయి. అలాగే చర్మం కూడా జిడ్డుగా కనిపిస్తుంది. ఈ కారణంగా చర్మ సమస్యలు పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె వాడితే ఉదయాన్నే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. జిడ్డుగల చర్మం కారణంగా మొటిమలు ఏర్పడుతాయి.
ముఖం ఎర్రగా మారవచ్చు కొబ్బరి నూనె వేడిగా ఉంటుంది. అందువల్ల శీతాకాలంలో దీనిని అప్లై చేయమని సలహా ఇస్తారు. అధిక వేడి కారణంగా మీకు చర్మ అలెర్జీ సమస్యలు ఉంటే దానిని వాడకుండా ఉండండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేడిగా ఉంటుంది. మసాజ్ చేయడం వల్ల ముఖం ఎర్రగా మారుతుంది. ఇది కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయి. కొబ్బరి నూనె వేడిగా ఉంటుంది. ఇది జుట్టుకు మంచిది అయినప్పటికీ. కానీ దీని అధిక వినియోగం చర్మానికి హానికరం. ఇది మొటిమల సమస్యను దారి తీస్తుంది.