Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Shankar Prasad: ఏఆర్ రెహ్మాన్ పాట వ‌ల్లే.. కేంద్ర మంత్రి ట్విట్ట‌ర్ బ్లాక్‌.. కాపీరైట్‌ జరిగిందంటూ చర్యలు..

AR Rahman song - Twitter: దేశంలో కొత్త ఐటీ నిబంధనలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ట్విట్ట‌ర్ ఖాతా శుక్ర‌వారం గంటపాటు

Ravi Shankar Prasad: ఏఆర్ రెహ్మాన్ పాట వ‌ల్లే.. కేంద్ర మంత్రి ట్విట్ట‌ర్ బ్లాక్‌.. కాపీరైట్‌ జరిగిందంటూ చర్యలు..
Ravi Shankar Prasad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 26, 2021 | 3:11 PM

AR Rahman song – Twitter: దేశంలో కొత్త ఐటీ నిబంధనలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ట్విట్ట‌ర్ ఖాతా శుక్ర‌వారం గంటపాటు ప‌నిచేయ‌ని విష‌యం తెలిసిందే. కాపీరైట్ చ‌ట్టం కింద ట్విట్ట‌ర్ సంస్థ ఆయ‌న ట్వీట్ల‌ను నిలిపివేసింది. అయితే మంత్రి ర‌విశంక‌ర్ ఓ మ్యూజిక్ కంపెనీ సౌండ్‌ట్రాక్‌ను వాడ‌డం వ‌ల్ల కాపీరైట్ జ‌రిగిన‌ట్లు పేర్కొంటున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేసిన ‘మా తుజే స‌లామ్’ పాట సౌండ్‌ట్రాక్‌లోని ఓ క్లిప్ కోసం మంత్రి వాడిన‌ట్లు లుమెన్ డేటాబేస్ ద్వారా వెల్ల‌డైంది. అమర సైనికులకు నివాళులర్పిస్తూ మంత్రి ఈ వీడియో కంటెంట్‌ను ఉపయోగించారు.

అయితే సోని మ్యూజిక్ సంస్థ ఆ కాపీరైట్‌ను జారీ చేసింది. అమెరికాకు చెందిన డిజిట‌ల్ మిలీనియ‌మ్ కాపీరైట్ యాక్ట్ కింద ఈ ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు ట్విట్ట‌ర్ వెల్లడించింది. ట్విట్ట‌ర్ సంస్థ భార‌తీయ ఐటీ చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన‌ట్లు మంత్రి ఆరోపించారు. అనంతరం మంత్రి రవిశంకర్ అకౌంట్‌కు ట్విట్ట‌ర్ లాగిన్ అవ‌కాశం క‌ల్పించింది.

ఇదిలాఉంటే.. మంత్రి రవిశంకర్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేసిన అనంతరం.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్‌ను కూడా మైక్రోబ్లాగింగ్ సంస్థ స్థంభింపజేసింది. ఇలా రెండు సార్లు జరిగిందని.. ఇది ముర్ఖత్వమేనంటూ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read:

SI sexual Harassment : మైనర్ బాలికపై SI లైంగిక వేధింపులు.. తండ్రిని, అన్నని చంపేస్తానంటూ గన్ తో బెదిరింపులు

Mumbai: దొంగతనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన బాలుడు.. ఆత్మహత్య చేసుకున్నాడంటూ…