Cryptocurrency: క్రిప్టోకరెన్సీ పై వచ్చే ఆదాయానికి టాక్స్ కట్టాలా? ఎంత పన్ను ఈ ఆదాయం మీద చెల్లించాలి? తెలుసుకోండి!

Cryptocurrency: చాలామంది ఇప్పుడు బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో ఎక్కువగా డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ ధర లక్షల్లో పలుకుతోంది.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ పై వచ్చే ఆదాయానికి టాక్స్ కట్టాలా? ఎంత పన్ను ఈ ఆదాయం మీద చెల్లించాలి? తెలుసుకోండి!
Cryptocurrency
Follow us
KVD Varma

|

Updated on: Jun 26, 2021 | 3:33 PM

Cryptocurrency: చాలామంది ఇప్పుడు బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో ఎక్కువగా డబ్బు పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ ధర లక్షల్లో పలుకుతోంది. బిట్‌కాయిన్, ఎథెరియం, డాగ్‌కోయిన్ వంటి క్రిప్టోకరెన్సీలను అమ్మడం, కొనుగోలు చేయడం ద్వారా ప్రజలు డబ్బు సంపాదిస్తున్నారు. ఆన్లైన్ స్టాక్ మార్కెట్ వ్యాపారంలా ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ జరుగుతోంది. ఈ క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా సంపాదించిన మొత్తం వ్యాపార లాభం కింద పరిగణిస్టారు. అందువల్ల దీనికి ఆదాయపు పన్ను కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ లెక్కలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి రావచ్చు. క్రిప్టోకరెన్సీకి సంబంధించి లెక్కలు ప్రభుత్వానికి ఎలా చెప్పాలి అనేది తెలుసుకునే ముందు అసలు దీనికి సంబంధించిన నియమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

మొదట్లో రిజర్వ్ బ్యాంక్ క్రిప్టోకరెన్సీ వర్తకం చట్టవిరుద్ధమని ప్రకటించింది. అలాంటప్పుడు చట్టవిరుద్ధమైన దానిపై ఎలా పన్ను విధించాలనే ప్రశ్న తలెత్తింది. అయితే, తరువాత ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లి దేశ అత్యున్నత న్యాయస్థానం బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల వ్యాపారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. భవిష్యత్తులో, రిజర్వ్ బ్యాంక్ కూడా క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేసేస్తుందని అందరూ భావించారు. కానీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఇప్పటివరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ సందిగ్ధ పరిస్థితిలో క్రిప్టోకరెన్సీ చట్టవిరుద్ధం కానీ.. చట్టబద్ధమైన వ్యాపారంగా చెప్పుకోవచ్చు. అందుకే బిట్ కాయిన్ వంటి వాటిపై వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పన్ను నియమాలేమిటి?

క్రిప్టోకరెన్సీ ద్వారా వచ్చే ఆదాయాలపై ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందనే దానిపై స్పష్టమైన నియమం లేదు. ఆదాయాల పరంగా పన్ను చెల్లించాల్సి వస్తుందా లేదా అనే దానిపై ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఎటువంటి సూచనలు జారీ చేయలేదు. పన్ను చెల్లించాల్సి వస్తే, ఆ మొత్తం ఎంత ఉంటుంది? బిట్‌కాయిన్‌లను కలిగి ఉన్న వ్యక్తులు సంపాదనను కొనసాగించడానికి, పన్ను చెల్లించకుండా ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే, భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏదైనా ఆదాయ వనరు (అది క్రిప్టోకరెన్సీ కావచ్చు.. మరోటి కావచ్చు) పన్ను పరిధిలోకి వస్తుంది అని పన్ను నిపుణులు చెబుతున్నారు. క్రిప్టోకరెన్సీల కొనుగోలు, అమ్మకం కూడా ఒక రకమైన పెట్టుబడి, కాబట్టి పన్ను విధించే అంశంలోకి అది వస్తుంది.

ఎంత పన్ను చెల్లించాలి

బిట్‌కాయిన్‌లు కలిగి ఉన్న వ్యక్తులు ఎంత పన్ను చెల్లించాలో పన్ను నిపుణుడిని సంప్రదించాలి. పెట్టుబడి రకాన్ని తెలుసుకొని, మీరు పన్ను చెల్లించవచ్చు. క్రిప్టోకరెన్సీని కరెన్సీగా తీసుకున్నారా లేదా ఆస్తిగా తీసుకున్నారా అనే దానిపై పన్ను ఆధారపడి ఉంటుంది. క్రిప్టోకరెన్సీని అమ్మడం ద్వారా ఆదాయం ఉంటే, అది వ్యాపార ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు. మీరు విచక్షణారహితంగా బిట్‌కాయిన్ వ్యాపారం చేస్తే, మీరు వ్యాపార ఆదాయంగా పన్ను చెల్లించాలసి ఉంటుంది. మీరు దానిని పెట్టుబడిగా తీసుకొని దానిని హోల్డ్ లో పెట్టుకుంటే, మూలధన లాభం ప్రకారం పన్ను చెల్లించాలి. పన్నుల శాఖ నుండి ఆదేశాలు లేకపోతే, క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు 30% చొప్పున పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

‘ఇతర మూలం నుండి వచ్చే ఆదాయం’ అంటే ఏమిటి

బిట్‌కాయిన్ లేదా ఇతర క్రిప్టోకరెన్సీల నుండి వచ్చే ఆదాయాలను ఊహాజనిత ఆదాయంగా పరిగణించవచ్చు. ఇటువంటి వాటిని ‘ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం’ అని పిలుస్తారు. ఈ కోణంలో, క్రిప్టోలో పెట్టుబడులు పెట్టే ప్రజలు తమను తాము సురక్షితంగా ఉంచాలని కోరుకుంటారు. ఆదాయపు పన్ను శాఖ చర్యను నివారించడానికి ఏదైనా చేయవలసి వస్తే, 30 శాతం పన్ను చెల్లించడం వారికి సరైన ఎంపిక అని వారు భావిస్తున్నారు. ఇది ‘ఇతర మూలం నుండి వచ్చే ఆదాయం’ కింద పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి 3 సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడిని రీడీమ్ చేస్తే, అది స్వల్పకాలిక మూలధన లాభం రూపంలో వస్తుంది. తదనుగుణంగా పన్ను విధించే అవకాశం ఉంది. 3 సంవత్సరాల తరువాత క్రిప్టోకరెన్సీని అమ్మడం ద్వారా లాభం పొందితే, అది దీర్ఘకాలిక మూలధన లాభం రూపంలో వస్తుంది. దీనికి 20% పన్ను విధించవచ్చు.

పన్ను చెల్లించండి

క్రిప్టోకరెన్సీ భారతదేశంలో చట్టబద్ధం కాదు, దాని లావాదేవీ చట్టవిరుద్ధమని దీని అర్థం కాదు. అందువల్ల, ఆదాయపు పన్నును దాఖలు చేసేటప్పుడు, అందులో క్రిప్టోకరెన్సీని పేర్కొనండి. ఆదాయపు పన్నును దాఖలు చేస్తున్నప్పుడు, క్రిప్టో నుండి వచ్చే ఆదాయాలు వ్యాపారం లేదా ఏదైనా ఆస్తి తరగతి వ్యాపారం అని పేర్కొనండి. ‘ఇతర మూలం నుండి వచ్చే ఆదాయం’ లో చెప్పడం సులభమయిన మార్గం. ఈ వర్గంలో ఉత్పత్తి చేయబడిన పన్నును చెల్లించండి.

Also Read: Income Tax: కరోనా చికిత్సపై  ఖర్చుకు టాక్స్ లేదు.. కరోనాతో మరణిస్తే కంపెనీ ఇచ్చే ఎక్స్-గ్రేషియా పై కూడా పన్ను విధించరు!

CryptoCurrency: బిట్ కాయిన్ బుడగ పేలిపోయింది..మళ్ళీ పుంజుకునే ఛాన్స్ ఉందా? క్రిప్టో కరెన్సీ కథ తెలుసుకోండి!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..