Income Tax: కరోనా చికిత్సపై  ఖర్చుకు టాక్స్ లేదు.. కరోనాతో మరణిస్తే కంపెనీ ఇచ్చే ఎక్స్-గ్రేషియా పై కూడా పన్ను విధించరు!

Income Tax:  కరోనా సోకినా ఒక ఉద్యోగి మరణిస్తే.. ఆ తరువాత అతని కుటుంబానికి చికిత్స కోసం సంస్థ నుంచి అందుకున్న పరిహారాన్ని(ఎక్స్-గ్రేషియా) పన్ను రహితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Income Tax: కరోనా చికిత్సపై  ఖర్చుకు టాక్స్ లేదు.. కరోనాతో మరణిస్తే కంపెనీ ఇచ్చే ఎక్స్-గ్రేషియా పై కూడా పన్ను విధించరు!
Income Tax
Follow us
KVD Varma

|

Updated on: Jun 25, 2021 | 9:35 PM

Income Tax:  కరోనా సోకినా ఒక ఉద్యోగి మరణిస్తే.. ఆ తరువాత అతని కుటుంబానికి చికిత్స కోసం సంస్థ నుంచి అందుకున్న పరిహారాన్ని(ఎక్స్-గ్రేషియా) పన్ను రహితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఈ నిర్ణయం దేశంలోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులలో కరోనా బారిన పడిన వారి కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా చెల్లింపు ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన తరుణంలో రావడం గమనార్హం. ఇక పాన్, ఆధార్‌లను అనుసంధానించడానికి ప్రభుత్వం చివరి తేదీని 3 నెలలు పొడిగించింది. అలాగే, పన్ను చెల్లింపుదారులకు మరో ఉపశమనం ఇస్తూ, టిడిఎస్ దాఖలు చేయడానికి చివరి తేదీని జూన్ 30 నుండి జూలై 15 వరకు పొడిగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఈ విషయంపై ప్రకటన చేశారు.

ఎక్స్-గ్రేషియా చెల్లింపు పరిమితి రూ .10 లక్షల వరకు

కోవిడ్ చికిత్స కోసం సంస్థ లేదా మరే వ్యక్తి నుండి తీసుకున్న మొత్తానికి ఎటువంటి పన్ను విధించడం జరగదని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ మినహాయింపు 2019-20, 2021-22 రెండు ఆర్థిక సంవత్సరాలకు వర్తిస్తుందన్నారు. తన స్నేహితుడికి, బంధువుకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి చేసిన ఎక్స్-గ్రేషియా చెల్లింపుపై మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. దీని పరిమితి రూ .10 లక్షల వరకు ఉంటుంది. పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ఏప్రిల్ 1 వరకు చేసిన పెట్టుబడులను సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయవచ్చని ఆయన అన్నారు. కొత్త నోటిఫికేషన్ ఉద్యోగులకు వారి జీతం ప్రకారం లభించే పన్ను మినహాయింపునకు భిన్నంగా ఉంటుందని పన్ను నిపుణులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మరుసటి రోజు లేదా రెండు రోజుల్లో ఇవ్వబడుతుంది.

కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వారు అనారోగ్య వ్యయాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అందుకే వారికి పన్ను రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కింద, కరోనాతో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఒక సంస్థ ఎక్స్-గ్రేషియా చెల్లింపు చేస్తే, ఆ మొత్తాన్ని 2019-20 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాలకు పన్ను విధించరు అంటూ వివరించారు. అదేవిధంగా పాన్, ఆధార్లను లింక్ చేయడానికి చివరి తేదీ 3 నెలలు పొడిగించినట్లు ఆయన చెప్పారు.  ఈ గడువు 30 సెప్టెంబర్ 2021 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు ఈ గడువు 30 జూన్ 2021.

Also Read: Aadhaar-Pan Card: అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ మరోసారి పొడిగింపు.. వివరాలివే.!

SBI Customers Alert: ‘వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు.. ముప్పు కొని తెచ్చుకోవద్దు’.. సైబర్‌ మోసాలను ఇలా అడ్డుకోండి!