SBI Customers Alert: ‘వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు.. ముప్పు కొని తెచ్చుకోవద్దు’.. సైబర్ మోసాలను ఇలా అడ్డుకోండి!
ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ గురించి మనమంతా తెలుసుకోవాలి. లేదంటే సైబర్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే బలైపోతాం.
SBI Cybercrime: ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ గురించి మనమంతా తెలుసుకోవాలి. లేదంటే సైబర్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే బలైపోతాం. వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలను వేరే వాళ్లతో షేర్ చేసుకుంటే, కచ్చితంగా మనం ఏదో ఒక రోజు మనం మోసపోతాం. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులను సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది. సైబర్ క్రైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కోరింది.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. తన అధికారిక ట్విట్టర్ లో ఈ మేరకు ఓ ట్వీట్‌ను షేర్ చేసి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు సహాయం చేస్తోంది. “మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితో పంచుకోకూడదు. ప్రైవేటుగా దాచుకోవాలని గుర్తుంచుకోండి. సైబర్ క్రైమ్ బారిలో పడకుండా ఉండేందుకు ఈ ముఖ్యమైన చిట్కాలను పాటించండి. మరింత సమాచారం కోసం cybercrime.gov.in సంప్రదించండి” అంటూ ట్వీట్ చేసింది.
‘వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితో పంచుకోకూదు.. ఇలా చేస్తే కోరి ప్రమాదాలను తెచ్చుకున్న వారవుతారని’ ఎస్‌బీఐ తెలిపింది. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేందుకు వినియోగదారులు కొన్ని చిట్కాలు పాటించాలని ఎస్‌బీఐ పేర్కొంది. అవేంటో చూద్దాం…
1) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీ వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదు.
2) కోవిడ్-19 టీకా సర్టిఫికేట్ లేదా వ్యక్తిగత వివరాలున్న ఎలాంటి పత్రాన్ని ఇతరులకు ఇవ్వకూడదు.
3) ధృవీకరించుకోకుండా ఇతరులకు ఫండ్స్‌ను బదిలీ చేయకూడదు.
4) అనుమానాస్పదంగా మెయిల్స్ వస్తే.. వాటిని ఓపెన్ చేయకపోవడమే మంచిది. మోసపూరిత లింక్‌లను క్లిక్ చేయకూడదు.
5) డెబిట్ కార్డు లేదా ఐఎన్‌బీ(ఇంటర్నెట్ బ్యాంకింగ్) వివరాలను జాగ్రత్తగా దాచుకోవాలి. ఇతరులతో పంచుకోకూడదు.
6) నకిలీ సందేశాలు, తప్పుడు సమాచారంపై జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ ఇలాంటి సంఘటన ఎదురైతే వెంటనే cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలి.
“మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అన్‌లైన్‌లో ఎటువంటి వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదు. అలాగే తెలియని వెబ్‌సైట్స్ నుంచి దేనిని డౌన్‌లోడ్ చేసుకోకూడదని” ఎస్‌బీఐ ట్వీట్ లో పేర్కొంది.
అలాగే సైబర్ క్రైమ్‌లో చిక్కుకోకుండా వినియోగదారులు కొన్ని టిప్స్ పాటించాలని సూచించింది. అవేంటో చూద్దాం..
1) పుట్టిన తేదీ, డెబిట్ కార్డ్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ / పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్, ఓటీపీతోపాటు ఇతర వ్యక్తిగత వివరాలు వేరొకరితో పంచుకోకూడదు.
2) ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసులు, కేవైసీ పూర్తి చేస్తామంటూ తరుచుగా కాల్స్ వస్తుంటాయని, వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి.
3) ధృవీకరించుకోకుండా ఎస్‌బీఐ కస్టమర్లు ఎలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకూడదు. అలాగే ఫోన్ కాల్స్ లేదా ఈ మెయిల్స్ నుంచి వచ్చే యాప్‌లను అస్సలు డౌన్‌లోడ్ చేయకూడదు.
4) ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లతోపాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల నుంచి వచ్చే ఆఫర్లపై వెంటనే స్పందించకూడదు.
మీ వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్ లేదా వన్ టైమ్ (హై సెక్యూరిటీ) పాస్‌వర్డ్ ల కోసం ఎస్‌బీఐ లేదా బ్యాంక్ ప్రతినిధులు కాల్స్ లేదా ఈమెయిల్స్ చేయరు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి. అలాగే బ్యాంకు నుంచి వ్యక్తిగత సమాచారం కోసం కాల్స్ రావని వినియోగదారులు గుర్తించాలి. జాగ్రత్తగా ఉండకపోతే మీ డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. అటువంటి ఈమెయిల్‌లు లేదా ఫోన్ కాల్స్ వస్తే.. వెంటనే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని ఎస్‌బీఐ సూచించింది.
Always remember that your personal information needs to be kept private. Pay attention to these important safety tips to avoid cybercrime.
Click here to report any such incident at https://t.co/3Dh42iwLvh #SBI #StaySafe #StayVigilant #SafetyTips #OnlineSafety pic.twitter.com/BMVkZlSZIB
— State Bank of India (@TheOfficialSBI) June 24, 2021
Also Read:
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గమనిక..! మీ డబ్బు అకౌంట్లో జమ కావాలంటే ఈ వివరాలను ఒక్కసారి చెక్ చేసుకోండి..
Windows 11: ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన విండోస్ 11; అందుబాటులోకి ఎప్పుడంటే..?
PPF Account : ఒక రోజులో పిపిఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ చేయవచ్చు..! పరిమితులేంటి తెలుసుకోండి..