EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గమనిక..! మీ డబ్బు అకౌంట్లో జమ కావాలంటే ఈ వివరాలను ఒక్కసారి చెక్ చేసుకోండి..
EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది.
EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఖాతాదారులు వీటిని క్లెయిమ్ చేసుకోవాలంటే వారి బ్యాంక్ ఖాతా వివరాలను, కేవైసి ప్రక్రియను అప్‌డేట్ చేయాలి. అప్పుడే ఎటువంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొంది.
ఇటీవల చాలా బ్యాంకులు విలీనమయ్యాయి. వాటి IFSC కోడ్‌లు మారాయి. విలీనం అయిన ప్రభుత్వ బ్యాంకుల కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేసేటప్పుడు సమస్యలు రాకుండా ఉండాలంటే వారి ఖాతాలను EPFOతో లింక్ చేయమని కోరింది. పిఎఫ్ ఖాతాలను బ్యాంకులతో అనుసంధానించకపోతే చందాదారుడు డబ్బును క్లెయిమ్ చేసుకోలేడని గమనించాలి. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా పిఎఫ్ చందాదారులు ఉన్నారు.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) అనేది ప్రభుత్వ-మద్దతుగల పథకం. ఇది జీతం ఉన్న ఉద్యోగులకు తప్పనిసరి. ఈ ఫండ్‌లో జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగి, మరో భాగాన్ని యజమాని అందిస్తారు. సాధారణంగా రిటైర్మెంట్ కార్పస్‌ను అందించడం ఈ సంస్థ లక్ష్యం. జూలై నుంచి తమ ఖాతాను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయమని EPFO యజమానిని కోరింది. విఫలమైతే PF ఖాతాదారులకు యజమాని అందించే సహకారాన్ని నిలిపివేయవచ్చు. అలాగే పిఎఫ్ ఖాతాదారుల ఖాతాలు ఆధార్‌తో లింక్ చేయకపోతే వారు ఇపిఎఫ్‌ఓ ఇతర సేవలను ఉపయోగించలేరు.