Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి.. కొలీగ్ చేసిన పనికి దొరికి 16 ఏళ్ళు నరకం చూపించినా రహస్యం చెప్పని వీరుడు ఎవరో తెలుసా

The Black Tiger:  మనం ఈరోజు స్వేచ్చావాయువులు పీలుస్తూ.. వాక్ స్వాతంత్య్రం, అనుభవిస్తూ.. ఆనందంగా జీవితం గడపడానికి వెనుక ఎందరో వీరుల త్యాగఫలం.. మనం స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామంటే...

పాకిస్థాన్ లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి.. కొలీగ్ చేసిన పనికి దొరికి 16 ఏళ్ళు నరకం చూపించినా రహస్యం చెప్పని వీరుడు ఎవరో తెలుసా
Ravindra Kaushik
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2021 | 10:16 PM

The Black Tiger:  మనం ఈరోజు స్వేచ్చావాయువులు పీలుస్తూ.. వాక్ స్వాతంత్య్రం, అనుభవిస్తూ.. ఆనందంగా జీవితం గడపడానికి వెనుక ఎందరో వీరుల త్యాగఫలం.. మనం స్వేచ్ఛ స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామంటే ఎందరో దేశ భక్తులు తమ ప్రాణాలను లెక్కచేయలేకుండా మనకు పెడుతున్న బిక్ష అని చెప్పవచ్చు.. మనదేశాన్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాకిస్తాన్ వెళ్లి అక్కడే ఉండి వారికీ చిక్కి చివరికి అతిదీనంగా మరణించిన ‘రా ఏజెంట్’ రవీందర్ కౌశిక్ గురించి తెలుసుకుందాం.

రవీందర్ కౌశిక్ ఫేమస్ ఇండియన్ ఏజంట్. ఇతనిని బ్లాక్ టైగర్ అని పిలుస్తారు. పాకిస్థాన్ సైన్యానికి అనుకోకుండా దొరికిపోయి జైలుశిక్ష అనుభవించి జైలులో మరణించాడు. రవీందర్ 1952 ఏప్రిల్ 11 న కర్నాల్, హర్యానాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఉంది. అంతేకాదు ఆయనకు నాటకాలలో ప్రవేశం కూడా ఉంది. తన 23 వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW లో చేరారు. ఆ రోజులలో పాకిస్తాన్కు “అండర్ కవర్”గా వెళ్ళడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో నేను వెళ్ళతాను అని ముందుకు వచ్చారు.

పాకిస్థాన్ వెళ్ళడం కోసం ఉర్ధూ నేర్చుకున్నారు తన మతం మార్చుకున్నారు, ముస్లింల మత విద్యను నేర్చుకొని అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ 1975 లో పాకిస్థాన్ వెళ్ళారు. పాకిస్థాన్ కు అనుమానం రాకుండా ఉండటానికి ముందుగా కరాచి యూనివర్శిటీలో LLB పూర్తిచేసి తరువాత పెద్ద హోదాలో పాకిస్తాన్ ఆర్మీలో చేరారు. ఇస్లాం మతం తీసుకున్నారు. స్థానికంగా ఉండే అమానత్ ను వివాహమాడారు. 1979 నుండి 1983 వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్ని RAW, భారతీయ సైనిక దళాలకు పంపించేవారు పాకిస్థాన్ దొంగ దెబ్బ తీయలనుకున్న ప్రతిసారి ముందగ సమాచారం ఇచ్చి కాపాడేవారు. కాని దురదృష్ట వశాతూ మసిహ అనే మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వలన రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయారు.

అప్పటి నుండి 16 సంవత్సరాలు ఇండియా రహస్యాలు చెప్పమని రవీందర్ కౌశిక్ ను తీవ్రంగా హింసించారు.చేతులకు , కాళ్ళకు ఉన్న గోళ్ళను తీసివేసి రక్తాలు వచ్చే విధంగా సూదులతో గ్రుచ్చుతూ , నోట్లో ఉన్న పళ్ళను రాతితో పగులగొట్టారు. శరీరంలోని సున్నిత భాగాలలో చిన్నపాటి ఇనుప శూలాలను గ్రుచ్చి నరకం చూపించారు. ఆయన మలవిసర్జనాన్ని ఆయన చేతే బలవంతంగా తినిపించినప్పటికీ..గొప్ప దేశ భక్తుడైన ఈ వీరుడు దేశానికి సంబంధించిన ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదట. తనను మన భారత ప్రభుత్వం ఎప్పటికైనా కాపాడుతుందని ఎదురు చూసి చూసి చివరికి క్షయ వ్యాధి సోకి 1999 జూలై 26 న మరణించారు. అతనిని జైలు వెనుక భాగంలోనే ఖననం చేసారు. ఇతనికి స్వయానా ఇందిరా గాంధీనే బ్లాక్ టైగర్ అని బిరుదునిచ్చింది. ఇప్పటికీ మనకు తెలియకుండా ఇలాంటి దేశ భక్తులు ఎందరో పాకిస్థాన్ జైల్లో ఇప్పటికీ లెక్కలో లేకుండా ఎన్నో రకాల శిక్ష లు అనుభవిస్తూ దేశ భద్రత కొసం ప్రాణాలు అర్పిస్తునే ఉన్నారు. ఇలాంటి చరిత్ర లు మనకు తెలియకుండా ఉన్నవి ఎన్నో ఎన్నెన్నో..అలాంటి దేశభక్తులను తలచుకుంటూ.. నివాళులర్పిస్తూ.. జై హింద్ . అంటూ గౌరవం చాటుదాం.. మన భావితరాలకు ఇలాంటి వీరుల గురించి త్యాగం గురించి కథలుగా చెబుదాం..

అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో తెలుసా..?
యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో తెలుసా..?