Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India International Travel: సెకండ్ వేవ్ తర్వాత భారతీయ ప్రయాణీకులను అనుమతిస్తున్న దేశాలు ఇవే.. కండిషన్స్ అప్లై

India International Travel: ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి భారత దేశం కోలుకుంటుంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా చేపట్టిన ప్రభుత్వాలు.. మరోవైపు కరోనా నివారణకు తీసుకున్న చర్యలతో...

India International Travel: సెకండ్ వేవ్ తర్వాత భారతీయ ప్రయాణీకులను అనుమతిస్తున్న దేశాలు ఇవే..  కండిషన్స్ అప్లై
India International Travel
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2021 | 5:25 PM

India International Travel: ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుంచి భారత దేశం కోలుకుంటుంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా చేపట్టిన ప్రభుత్వాలు.. మరోవైపు కరోనా నివారణకు తీసుకున్న చర్యలతో కేసులు తగ్గుముఖం ఆడుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ రూపంలో భారత్ పై మహమ్మారి విరుచుకుపడిన సమయంలో ఇతర దేశాలు భారత ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. తమ దేశంలోకి అడుగుపెట్టడానికి వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశాయి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడంతో చాలా దేశాలు భారత చెబుతున్నాయి. రష్యా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఈజిప్టు వంటి అనేక దేశాలు షరతులతో కూడిన అనుమతిలీచ్చాయి. ఆ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

రష్యా కరోనా ఉధృతి తరవాత పర్యాటక రంగంపై ఇప్పుడిప్పుడే మళ్ళీ దృష్టి పెట్టింది. ఇటీవలే విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. రష్యాకు వెళ్లే ప్రయాణికులు.. తమ ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. అయితే యాంటీబాడీ టెస్ట్ చేయించుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించమని ప్రకటించింది.

తమ దేశంలోకి వచ్చే ప్రయాణకుల నుంచి ప్రయాణానికి 72 గంటల ముందు నెగెటివ్ సర్టిఫికెట్ పొందాలని చెప్పింది. అంతేకాదు తమ దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రయాణికులు 14 రోజులపాటు క్వారెంటైన్ తప్పనిసరని తెలిపింది.

టర్కీ కు కూడా వెళ్లంటే ప్రయాణీకులు ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. అటువంటి వారికి తమ దేశంలోకి అనుమతిస్తోంది. ప్రయాణికులు అక్కడి చేరుకున్న తర్వాత మరోసారి టెస్టు చేయించుకోమని కోరే అవకాశం ఉంది.. ఇక 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో తప్పని సరిగా ఉండాలి.

ఐతే ఎటువంటి కోవిడ్ నిబంధనలతో సంబంధం లేకుండా అన్నిదేశాల ప్రయాణీకులకు ఐస్ లాండ్ స్వగతం పలుకుతుంది. అయితే . ఐలాండ్ చేరుకున్న తర్వాత ప్రయాణికులందరికీ కొవిడ్ స్క్రీనింగ్ నిర్వహిస్తోంది.అంతేకాదు ప్రయాణికులు ఐదురోజులపాటు క్వారెంటైన్‌లో ఉన్న తర్వాత కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అపుడు నెగెటివ్ వస్తే.. ప్రయాణికుల క్వారెంటైన్ గడువు ముగిసినట్టే అని ఐస్‌లాండ్ వెల్లడించింది. అయితే భారత ప్రయాణికులు కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టైతే.. నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపాల్సిన అవసరం లేదు.

ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతీయ ప్రయాణికులకు స్వాగతం పలుకుతుంది. అయితే ప్రయాణానికి 72 గంటల ముందు నెగెటివ్ సర్టిఫికెట్ పొందినవారిని మాత్రమే తమ దేశంలోకి ప్రవేశించడానికి అర్హులని తెలిపింది. అయితే ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లో కొవిడ్ విజృంభణ కారణంగా కొన్ని వారాలపాటు ఆ ప్రాంతం వైపు వెళ్లొద్దని ప్రయాణికులకు సూచిస్తోంది.

సెర్బియా..కూడా భారతీయ ప్రయాణికులను అనుమతిస్తుంది. అయితే ప్రయాణానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని సెర్బియా వెల్లడించింది.

ఈజిప్ట్ కూడా ప్రయాణానికి 72 గంటల ముందు పొందిన కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను ప్రయాణికుల నుంచి కోరుతోంది తమ దేశంలో అడుగు పెట్టిన తర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉండలని సూచిస్తుంది.

దక్షిణాఫ్రికా కూడా ప్రయాణికుల నుంచి ప్రయాణానికి 72 గంటల ముందు పొందిన నెగెటివ్ సర్టిఫికెట్ కోరుతోంది. ఎవరైనా సర్టిఫికెట్‌ను చూపించనట్టైతే.. సదరు ప్రయాణికులు సొంత ఖర్చుతో స్వీయనిర్భంధంలో ఉండాల్సి ఉంటుంది.

అమెరికాలోని ఓ దేశమైన కోస్టారీకా భారతీయ ప్రయాణికులకు ఎటువంటి కరోనా నిబంధనలు లేకుండా అనుమతిస్తుంది. అయితే కోస్టారీకాకు వెళ్లిన తర్వాత ప్రయాణికులు హెల్త్‌పాస్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: మంచి పోషకరమైన ఉసిరికాయతో నిల్వ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం