Tokyo Olympics: ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిస్తే రూ. 3 కోట్లు.. విజేతలకు సీఎం స్టాలిన్ బంపర్ ఆఫర్..
Tamil Nadu CM MK Stalin: జూలై నెలలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న
Tamil Nadu CM MK Stalin: జూలై నెలలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి. ఈ క్రీడల్లో భారత బృందం కూడా పాల్గొననుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచే భారత అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల నజరానా ఇస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. రజత పతక విజేతలకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 కోటి అందిస్తామని స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో భారత ఒలింపిక్ బృందంలో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా భారత అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయం క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని పలువురు పేర్కొంటున్నారు. దీంతోపాటు తమిళనాడులో కోవిడ్, లాక్‌డౌన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలిచ్చారు.
Also Read: