AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin C Benefits: విటమిన్ ‘C’తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మోతాదు దాటితే ప్రమాదమే..

కరోనా రెండో దశ ప్రభావం .. మన జీవన విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. విటమిన్స్, ఖనిజాలు.. పోషకాల లోపం ఆరోగ్యంపై ఎంతగా ప్రభావం చూపిస్తుందో తెలిసింది.

Vitamin C Benefits: విటమిన్ 'C'తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మోతాదు దాటితే ప్రమాదమే..
Vitamin C
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2021 | 2:46 PM

Share

కరోనా రెండో దశ ప్రభావం .. మన జీవన విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. విటమిన్స్, ఖనిజాలు.. పోషకాల లోపం ఆరోగ్యంపై ఎంతగా ప్రభావం చూపిస్తుందో తెలిసింది. ఇప్పుడు అందరూ కరోనాను జయించడానికి రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విటమిన్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక విటమిన్ సీ, డీ ఉన్న పదార్థాలను ఎక్కువగా తినేస్తున్నారు. అయితే డాక్టర్స్ చెప్పినట్లు విటమిన్స్ ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. మరి విటమిన్ సీ అందించే ఆరోగ్యా ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.

విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులను తగ్గిస్తుంది. అలాగే గుండె ఆనారోగ్యానికి కారణయమ్యే అధిక ట్రైగ్లిజరైడ్ లేదా ఎల్డీఎల్ (చెడు) కొలెస్టాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. మెదడు, వెన్నెముక, నరాల దగ్గర ఉండే ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను తగ్గిస్తుంది. విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్ కావడం వలన మెదడు ఆలోచన, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతేకాకుండా.. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఐరన్ శరీరంలోని ఆర్బీసీ (ఎర్ర రక్త కణాలు) ద్వారా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని సరఫరా చేయడానికి సహకరిస్తుంది. గౌట్ సమస్య ముఖ్యంగా కీళ్ల వాపుతో కూడిన ఆర్థరైటిస్ గా వస్తుంది. ఇది రక్తంలో యూరిక్ ఆమ్లం పెరగడం వలన ఏర్పడుతుంది. విటమిన్ సీ యూరిక్ ఆమ్లం రక్త స్థాయిలను తగ్గించడమే కాకుండా.. గౌట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరాన్ని ప్రీ రాడికల్స్ వంటి హానికరమైన అమువుల నుంచి రక్తిస్తుంది. ఊపిరితిత్తులలోకి చేరి వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

దుష్రభావాలు.. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. అంతేకాదు.. వికారం సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా.. విటమిన్ సీ మోతాదుకు మించి తీసుకోవడం వలన శరీరంలో ఐరన్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. దీనివలన హిమోక్రోమాటీస్ వస్తుంది. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది.

Also Read: Balka Suman : ఈటల లేఖ నకిలీదని బండి సంజయ్.. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేయాలి : బాల్కా సుమన్