Ashwagandha Benefits : అశ్వగంధతో అద్భుత ప్రయోజనాలు..! ఈ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం..
Ashwagandha Benefits : కరోనా టైంలో ఆయుర్వేదానికి డిమాండ్ బాగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి
Ashwagandha Benefits : కరోనా టైంలో ఆయుర్వేదానికి డిమాండ్ బాగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చాలామంచి ఇప్పుడు వంటింటి చిట్కాలను అనుసరిస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు మన ప్రాచీన ఆయుర్వేద నిపుణులు చెప్పినవే. ఇందులో చాలా తక్కువ ధరలో వివిధ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. వీరు ప్రకృతిలో లభించే మూలికలు, చెట్ల బెరడు, ఆకులు, దుంపలతో సహజ సిద్దంగా ఔషధాలను తయారుచేస్తారు. అందుకే వీటిని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందులో ముఖ్యమైనది అశ్వగంధ. పేరు లేని రోగానికి పెన్నేరు గడ్డే దిక్కని మన పెద్దలు అన్నారు. ఈ రోజు అశ్వగంధ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అశ్వగంధ పురాతన కాలం నుంచి ఎన్నో రకాల సమస్యలను పరిష్కరిస్తూ వచ్చింది. అశ్వగంధ ఉపయోగించడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి నొప్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలకు ఇది బాగా ఉపయోగ పడుతూ వచ్చింది. నిద్రలేమి సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే అశ్వగంధ పర్ఫెక్ట్. అశ్వగంధలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు కూడా చిటికెలో పరిష్కారం చూపుతుంది.
కొంతమందికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. వారు అశ్వగంధ తినడం ఉత్తమ పద్ధతి. అశ్వగంధ మెదడులోని ఎసిటైల్కోలిన్ స్థాయిని పెంచుతుంది. ఇది జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు, తెలివితేటలను పెంచుతుంది. అశ్వగంధ వృక్షజాలం, నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ గ్రంథులు, రోగనిరోధక వ్యవస్థ మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది శరీరం, మనస్సుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అశ్వగంధ పౌడర్‌లో రాడికల్ స్కావెంజింగ్ యాక్టివిటీ ఉంది. అశ్వగంధ పొడి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. దానితో పాటు అశ్వగంధ క్యాప్సిల్స్, టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. గోరు వెచ్చని పాలతో కానీ గోరు వెచ్చని నీళ్లతో కానీ వీటిని తీసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మీరు ఒక్కసారి దీనిని వాడే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.