CMET Recruitment: సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.

CMET Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ (సీ-మెట్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లో ఉన్న ఈ సంస్థ‌లో...

CMET Recruitment: సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.
Cmet Hyderabad
Follow us

|

Updated on: Jun 26, 2021 | 4:48 PM

CMET Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ (సీ-మెట్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లో ఉన్న ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 50 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా.. సీనియర్‌ ఇన్‌ఛార్జ్‌, షిప్ట్‌ ఇన్‌ఛార్జ్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్, జూనియర్‌ ప్రాజెక్ట్‌ స్టాఫ్‌, ఎలక్ట్రీషియన్‌, హెల్పర్‌, సీనియర్‌ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీర్‌, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీర్‌, ఇనుస్ట్రుమెంటేషన్ స్టాఫ్‌, జూనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, అనలిస్ట్‌, జూనియర్‌ ఆఫీస్‌ స్టాఫ్ పోస్ట‌ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు అనుగుణంగా పోస్టును అనుస‌రించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* పోస్టుల ప్ర‌కారం అభ్య‌ర్థుల వ‌య‌సు 32 నుంచి 35 ఏళ్లు మించ‌కూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌ను డైరెక్ట‌ర్‌, సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్స్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ, ఐడీఏ ఫేస్‌,3, చెర్ల‌ప‌ల్లి హైద‌రాబాద్ అడ్ర‌స్‌కు పంపించాలి. * అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రితేదీగా 14-07-2021ని నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల కోసం https://cmet.gov.in/ వెబ్‌సైట్‌ను చూడండి.

Also Read: Schools Reopen: జూలై 1 నుంచి తెలంగాణ‌లో పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభంకానున్నాయా.? అస‌లేం జ‌ర‌గ‌నుంది?

HSL Recruitment 2021: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

Bank of India Recruitment: 8వ తరగతి అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే