Etela vs Harish : ఈటెల రాజేందర్ తీరును చీల్చి చెండాడిన మంత్రి హరీష్ రావు.. భావదారిద్య్రం అంటూ..
Etela Rajender Issue: బహిష్కృత మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్...
Etela vs Harish : బహిష్కృత మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఈటల రాజేందర్ వైఖరి ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చని అన్నారు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు సైతం అనేక అవమానాలు ఎదుర్కొన్నారంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేసిన దరిమిలా శనివారం నాడు ఆయన పై విధంగా స్పందించారు. ఈటెల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే ఆయన తీరును తూర్పారబడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
ఈటెల వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. ‘‘టీఆర్ఎస్ పార్టీలో నేను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధి. పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కార్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను. గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా తేల్చి చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. కంఠంలో ఊపిరిఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటాను.’’ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
ఈటెల రాజేందర్‌పై సంచలన కామెంట్స్.. ఇదే సమయంలో ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ‘‘తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ వైఖరి. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడినా టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. తన సమస్యలకు, తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.
Harish Rao Comments Live:
Also read:
CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ సోమవారం ఢిల్లీ టూర్.. హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం!