AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ‘అహం బ్రహ్మాస్మి’ కోసం మంచు మనోజ్ కఠినమైన వర్కవుట్స్.. నయా లుక్ కోసం ఏకంగా 10 కిలోలు తగ్గిన హీరో..

Aham Brahmasmi: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. ‘దొంగా దొంగది’ మూవీతో హీరోగా స్ర్కీన్ పై కనిపించాడు. మొదటి

Manchu Manoj: 'అహం బ్రహ్మాస్మి' కోసం మంచు మనోజ్ కఠినమైన వర్కవుట్స్.. నయా లుక్ కోసం ఏకంగా 10 కిలోలు తగ్గిన హీరో..
Manchu Manoj
Rajitha Chanti
|

Updated on: Jun 05, 2021 | 5:49 PM

Share

Aham Brahmasmi: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. ‘దొంగా దొంగది’ మూవీతో హీరోగా స్ర్కీన్ పై కనిపించాడు. మొదటి సినిమాలోనే కామెడీని పంచిన మనోజ్ అందరిచేత అదుర్స్ అనిపించుకున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలతోపాటు.. సరికొత్త కథలతో ముందుకొచ్చిన మనోజ్.. క్రిష్ డైరెక్షన్ లో ‘వేదం’ మూవీ చేశాడు. అయితే  చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం  మంచు మనోజ్‌ చేస్తున్న సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం కొన్ని కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడట మనోజ్. ఈ లాక్ డౌన్ లో ఈ మూవీలో కనిపించే సరికొత్త లుక్ కోసం కసరత్తులు చేస్తున్నట్లుగా సమాచారం.

ఈ సినిమా కోసం తన ఫిజిక్ ను పూర్తిగా మార్చడానికి కఠినమైన వర్కవుట్ లు చేసి, మనోజ్ దాదాపు 10 కిలోల బరువు తగ్గాడట. ఇక ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్ ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల తన పుట్టిన రోజు కానుగా.. కరోనా వల్ల కష్టాలు పడుతున్న 25 వేల కుటుంబాలకు తనవంతుగా నిత్యావసరాలు అందించి గొప్ప మనసు చాటుకున్నాడు మనోజ్

Also Read: The Family Man 2: బోల్డ్ అండ్ గస్టీ పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టిన‌ సమంత.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా

The Family Man-2: డాక్యూమెంటరీ చూస్తే భయమేసింది.. కానీ కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయింది.. సమంత..