AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Police: ఫేక్‌ పోలీసుల హల్ చల్.. నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారని తనిఖీలు.. తర్వాత ఏం జరిగిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడుమండలం పడమటి నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పురుగుమందుల వ్యాపారి చెరుకుమల్లి రుక్కయ్య ఇంటికి కారులో వచ్చిన నలుగురు దుండగులు కత్తులతో బెదిరించి తలుపులు వేసి ఇంటిలో ఉన్న ఇంటి బీరువాలో ఉన్న నగదు సుమారు 15 లక్షలు తో పాటు 15 లక్షల విలువ చేసే బంగారు వస్తువులను ఎత్తుకు వెళ్ళారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు ఇద్దరు గేటు బయట ఉండి ఇద్దరిని లోపలికి పంపించి మొదట పోలీసులమని చెప్పి తరవాత లోపలికి వచ్చి చోరీ చేశారు..

Fake Police: ఫేక్‌ పోలీసుల హల్ చల్.. నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారని తనిఖీలు.. తర్వాత ఏం జరిగిందంటే..
Fake Police Case
N Narayana Rao
| Edited By: Subhash Goud|

Updated on: Aug 23, 2023 | 11:15 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 23: పోలీసుల మని చెప్పారు.. తలుపులు కొట్టగా వారు తలుపు లు తీశారు.. మీరు నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని.. మాకు సమాచారం వచ్చింది.. ఇంట్లో తనిఖీలు నిర్వహించాలని వారికి చెప్పారు. ఇంతలోనే వారు ఒక్కసారిగా కత్తులు, మారణ ఆయుధాలు బయటకు తీసి .. తలుపులు మూసివేసి చంపేస్తామంటూ బెదిరించారని బాధితులు పేర్కొన్నారు. ఈ హఠాత్ పరిణామానికి భయపడి పోయారు భార్య,భర్తలు. ఇద్దరిని వేరు వేరు గదుల్లో బందించి బీరువా తాళాలు తీయాలని లేకుంటే చంపుతామని బెదిరించారు. బీరువా తాళాలు తీయడంతో. అందులో ఉన్న రూ 15 లక్షల నగదు , నగలు దోచుకుని వెళ్ళారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడుమండలం పడమటి నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పురుగుమందుల వ్యాపారి చెరుకుమల్లి రుక్కయ్య ఇంటికి కారులో వచ్చిన నలుగురు దుండగులు కత్తులతో బెదిరించి తలుపులు వేసి ఇంటిలో ఉన్న ఇంటి బీరువాలో ఉన్న నగదు సుమారు 15 లక్షలు తో పాటు 15 లక్షల విలువ చేసే బంగారు వస్తువులను ఎత్తుకు వెళ్ళారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు ఇద్దరు గేటు బయట ఉండి ఇద్దరిని లోపలికి పంపించి మొదట పోలీసులమని చెప్పి తరవాత లోపలికి వచ్చి చోరీ చేశారు

ఎవరికైనా ఫోన్ చేసినా చెప్పిన చంపుతామంటూ దుండగులు వచ్చిన కారులోని తిరిగి వెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా దేశంలో చాలా చోట్ల దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి తనిఖీలు చేస్తుంటే అప్రమత్తంగా ఉండాలని, వారి ఐడికార్డులు కానీ, వారి వద్ద ఉండే డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పత్రాలు అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. లేకపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తాము వచ్చి తెలుసుకుంటామంటున్నారు. ప్రస్తుతం నకిలీ పోలీసులమని వ్యాపారి ఇంట్లో తనిఖీ చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి ఎక్కడి వారు.. ఎక్కడి నుంచి వచ్చారు.. అనే దాని గురించి గమనిస్తున్నారు. అలాగే అక్కడి ప్రాంతంలో ఉండే సీసీ కెమెరాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. వ్యాపారి ఇంటికి వచ్చి తనిఖీ చేసిన వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారా.. లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వారా అని పరిశీలిస్తున్నారు. వ్యాపారితో ఎవరితోనైనా గొడవలు గానీ, ఇతర వివాదాలు ఏమైనా ఉన్నాయా.. ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి