Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spicy Bhel Puri: ఈ స్పైసీ భేల్ పూరీ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఇతనికి రూ.2.5 లక్షలు చెల్లించాల్సిందేనట!

ఒకే చోట వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించడానికి భారతదేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఢిల్లీ ఒకటి. ఈ నగరం చాట్, అనేక చట్పాటా ఆహార పదార్థాలకు కూడా ఆహార ప్రియులలో ప్రసిద్ధి చెందింది. అయితే భేల్ పూరీ రెసిపీని పంచుకోవడానికి లక్షలు తీసుకునే వారున్నారంటే ఆశ్చర్యపోతారు. ఆ పెద్దాయన స్పెషల్ రెసిపీని పొందడానికి మీరు లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది..

Spicy Bhel Puri: ఈ స్పైసీ భేల్ పూరీ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఇతనికి రూ.2.5 లక్షలు చెల్లించాల్సిందేనట!
Spicy Bhel Puri
Follow us
Subhash Goud

|

Updated on: Aug 22, 2023 | 6:19 PM

స్ట్రీట్ ఫుడ్ విషయంలో భారతదేశంలోని ప్రతి నగరంలో ప్రత్యేకమైనదనే చెప్పాలి. ప్రతి నగరంలో ఈ పానీ పూరీకి ఎంతో మంది అభిమానులుంటారు. నగరాల్లో చాలా చోట్ల రోడ్డు పక్కన ఓ నాలుగు చక్రాల బంబడి పెట్టుకుని పానీపూరీ, బేల్‌పూరీ తయారు చేస్తుంటారు. ఇక్కడికి వచ్చే జనాలు వీధి ఆహారాన్ని ఆస్వాదిస్తుంటారు. ఒకే చోట వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించడానికి భారతదేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఢిల్లీ ఒకటి. ఈ నగరం చాట్, అనేక చట్పాటా ఆహార పదార్థాలకు కూడా ఆహార ప్రియులలో ప్రసిద్ధి చెందింది. అయితే భేల్ పూరీ రెసిపీని పంచుకోవడానికి లక్షలు తీసుకునే వారున్నారంటే ఆశ్చర్యపోతారు. ఆ పెద్దాయన స్పెషల్ రెసిపీని పొందడానికి మీరు లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.

కర్లీ టేల్స్ ఇటీవల ఢిల్లీలోని నార్త్ క్యాంపస్‌లో భేల్ పూరీని అందిస్తూ బాగా ప్రాచుర్యం పొందిన ఒక వీధి వ్యాపారి ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ పెద్దాయన అతిపెద్ద హైలైట్ ఏంటంటే అతని రహస్య వంటకం. భేల్ పూరీ రెసిపీ రహస్యం చెప్పేందుకు అతను రూ.2.5 లక్షలు వసూలు చేస్తున్నాడట. ఇది వింటే మీరు షాక్ అవుతారు.

రుచికరమైన భేల్ పూరీని తయారు చేయడానికి, అతను అనేక అద్భుతమైన చట్నీలను ఉపయోగిస్తాడట. అలాగే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు, ఉడికించిన బంగాళాదుంపలు, వేరుశెనగలు, ఉబ్బిన అన్నం, మరిన్నింటితో తన పదార్థాలన్నింటినీ మిక్స్ చేస్తాడు. ఒక్కో ప్లేట్ ధర 60 రూపాయలు. ఇది తిన్నారంటే లైఫ్‌లో మర్చపోలేని విధంగా ఉంటుందట. అందుకే ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే కనుక అతనికి రూ.2.5 లక్షలు ముట్టచెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఆ భేల్‌పూరీ తయారీ రహస్యం గురించి పూర్తి వివరాలు చెబుతాడట.

చాట్ లేదా భేల్ పూరీని చాలా రుచికరమైనదిగా ఉంటుందట. ఇది సుగంధ ద్రవ్యాలు, ఇతర పదార్థాలు కలపడం వల్ల అద్భతమైన రుచి సొంతమవుతుంది. అయితే ఈ వీధి ఆహార పదార్థాలను ప్రత్యేకంగా చేస్తాడు. దీంతో ప్రత్యేకమైన రుచిని అందించేలా చేస్తాడు. చట్నీలు, మసాలాలు కూడా ఇందులో ఉంటాయి. ప్రతి దుకాణంలో ప్రత్యేకమైన చట్నీలు, మసాలాలు ఉంటాయి.

మీరు రుచికరమైన భేల్ పూరీని అందించే ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే, ఏ స్థలాన్ని సందర్శించాలో ఇప్పుడు మీకు తెలుసు. చట్‌పాటా, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరట. ఈ స్ట్రీట్‌ఫుడ్‌ ఢిల్లీలోని పటేల్ చెస్ట్, నార్త్ క్యాంపస్‌లో ఉంటుంది. ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మరి మీరు కూడా ఢిల్లీ వెళ్లినట్లయితే ఈ ప్రాంతానికి వెళ్లి ఈ ఫుడ్‌ని ఆస్వాదించి రండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి