Krishna Water Issue: రాజకుంటున్న కృష్ణా జల జగడం.. బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ENC మురళీధర్

Krishna Water Issue: కృష్ణా జగడం రాజుకుంటోంది. జల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. కేంద్రం గెజిట్‌పై ఇప్పటికే అగ్గిమీదగుగ్గిలమవుతున్న తెలంగాణ సర్కార్‌ తాజాగా...

Krishna Water Issue: రాజకుంటున్న కృష్ణా జల జగడం.. బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ENC మురళీధర్
Krishna River Board
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 20, 2021 | 9:31 PM

కృష్ణా జగడం రాజుకుంటోంది. జల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. కేంద్రం గెజిట్‌పై ఇప్పటికే అగ్గిమీదగుగ్గిలమవుతున్న తెలంగాణ సర్కార్‌ తాజాగా KRMB(Krishna River Management Board )కి లేఖ రాసింది. కృష్ణా జల జలాల్ని 50 శాతం నిష్పత్తిలో పంచాలంటూ కోరింది ప్రభుత్వం. ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకూ కృష్ణా జలాల్ని ఏపీ.. తెలంగాణలకు సమ ప్రాతిపదికన కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది టీఎస్‌ సర్కార్‌. కృష్ణానదీ పరివాహక ప్రాంతాల జనాభా ఆధారంగా పంపకాలు జరపాలని విజ్ఞప్తి చేసింది. క్యాచ్మెంట్‌ ఏరియా లెక్కన తెలంగాణకు 70.8 శాతం.. ఏపీకి 29.2 శాతం నీటి పంపకాలు చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు లేఖ రాశారు తెలంగాణ ENC మురళీధర్‌.

ఇటీవల కేంద్రం అటు గోదావరి, ఇటు కృష్ణా బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ గెజిట్‌ రిలీజ్‌ చేసింది. గెజిట్‌ ప్రకారం ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ సైతం బోర్డులే చూసుకోనున్నాయి. ఈ గెజిట్‌పై తెలంగాణ మండిపడుతోంది. గెజిట్‌తో మరోసారి అన్యాయం కేంద్రం అన్యాయం చేస్తోందని తెలంగాణ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా నదీ పరివాహకం తమ ప్రాంతంలోనే అధికం అంటోంది తెలంగాణ. ఇక్కడ 68 శాతం నదీ పరివాహకం ఉందని.. దాని ప్రకారం నీటి కేటాయింపులు జరపాలని కోరుతోంది. అత్యల్ప పరీవాహకం ఉన్న ఏపీకి అధిక నీటి కేటాయింపులేంటని ప్రశ్నిస్తోంది. కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు ఏపీ తరలించుకుపోతోందని వాదిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే కృష్ణా క్యాచ్‌మెంట్‌ ఏరియా ఆధారంగా నీటి కేటాయింపులు జరపాలని కోరుతోంది. ఈ మేరకు KRMBకి మరోసారి లేఖ రాసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి: Jeff Bezos success: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్ర విజయవంతం.. సురక్షితంగా భూమికి చేరిన క్యాప్సుల్

CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి