AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి

కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు...

CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి
CM YS Jagan
Sanjay Kasula
|

Updated on: Jul 20, 2021 | 3:24 PM

Share

థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో అధికారులు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులను నియమించాలి, కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలిని తెలిపారు. PHCల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్ ఆంక్షలు మరో వారం..

కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని అన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలి ప్రజలను కోరారు. జన సమూహాల ఉన్నచోట ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

సమర్థవంతంగా వ్యాక్సినేషన్‌..

సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 1,80,82,390 వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయని తెలిపారు. ఇంకా వినియోగించాల్సినవి 8,65,500 డోసులు ఉన్నాయని తెలిపారు. సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా చేశామన్నారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లుగా తెలిపారు. సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా వ్యాక్సిన్లను ఆదా చేయడం జరిగిందన్నారు. 45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: Farmers Profit: రైతులకు మరో గుడ్ న్యూస్.. వరిగడ్డిని బంగారంగా మార్చే గోల్డెన్ ప్లాన్..

Viral Video: ఈ కారు చూస్తే షాక్ అవుతారు.. చూసిన తర్వాత.. ఇది మోడల్ అంటూ మీరు కూడా ప్రశ్నిస్తారు..

Fevicol: ఫెవికోల్ సంస్థ పేరు.. కానీ అందులో అతికించే తెల్లని ద్రవ పదార్థాన్ని ఏమని పిలుస్తారో తెలుసా..