కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల..
పొన్నాల లక్ష్మయ్య ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హస్తం పార్టీకి బైబై చెప్పిన పొన్నాల.. కారెక్కబోతున్నారు. ఈ సందర్భంగా రేవంత్, పొన్నాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌లో పొన్నాల ఫ్యూచర్ ఏంటనే లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనగామ వేదిక కేసిఆర్ సమక్షంలో BRS కండువా కప్పుకోనున్నారు..

పొన్నాల లక్ష్మయ్య ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హస్తం పార్టీకి బైబై చెప్పిన పొన్నాల.. కారెక్కబోతున్నారు. ఈ సందర్భంగా రేవంత్, పొన్నాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌లో పొన్నాల ఫ్యూచర్ ఏంటనే లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనగామ వేదిక కేసిఆర్ సమక్షంలో భారతీయ రాష్ట్ర సమితి కండువా కప్పుకోనున్నారు.
సుమారు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కి సేవలందించిన పొన్నాల.. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ తనను అవమానించిందంటూ.. కనీసం టికెట్ కూడా ఇస్తారన్న గ్యారంటీ లేదంటూ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ వెంటనే అలెర్టయిన గులాబీ పార్టీ.. పొన్నాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీతో 45 ఏళ్ల అనుబoధానికి తెగదెంపులు చేసుకున్న పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువా కప్పు కోవడం ఖాయమైంది. స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. 45 నిముషాల పాటు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు, రాజీనామా చేయడానికి గల కారణాలను పొన్నాలను అడిగి తెలుసుకున్నారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు మంత్రి కేటీఆర్.
జనగామలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో పొన్నాల లక్ష్మయ్య గులాబీ గూటికి చేరన్నారు. హైదరాబాదు నుండి కేసీఆర్‌తో కలిసి హెలికాప్టర్ ద్వారా నేరుగా జనగామకు చేరుకుంటారు. ఆశీర్వాద సభలోనే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. అక్కడే కేసీఆర్ ప్రసంగం కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య ప్రసంగం ఉంటుంది.
ఇదిలావుంటే.. పొన్నాల లక్ష్మయ్య BRS పార్టీలో చేరడం ద్వారా బీసీల ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం.. మాజీ మంత్రిగా, జనగామలో పట్టున్న సీనియర్ నేత పొన్నల లక్ష్మయ్య కూడా ఇప్పుడు గులాబీ గూటికి చేరడం ద్వారా ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని విశ్వసిస్తున్నారు.
అయితే పొన్నాల లక్ష్మయ్య గులాబీ గూటికి చేర్చుకోవడంలో సఫలీకృతులైన కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ లో ఏ స్థాయి హోదా కల్పిస్తారు..? ఎలాంటి పదవి కట్టబెడతారు? అనే దానిపైన ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. భువనగిరి పార్లమెంట్ నుండి బరిలోకి దింపుతారని.. లేదంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకు తగిన హోదా కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
