AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏక్ నిరంజన్‌గా హస్తం పార్టీ నుంచి పోటికీ సై అంటున్న సీనియర్ లీడర్..!

సీనియర్ పొలిటిషియన్ జీవన్ రెడ్డి ఒకవైపు.. ఆయన పై మూడు దశాబ్దాలుగా పోటి చేస్తున్న ప్రత్యర్ధులు మరో వైపు.. రెండు వర్గాల టార్గెట్ ఒక్కటే.. ఎన్నికల్లో ఎలాగైనా విన్నర్ అవడమే.. మరోసారి తిరిగి తన కంచుకోటలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలనేదీ జీవన్ రెడ్డి టార్గెట్. రెండోసారి విజయ పరంపర కొనసాగించాలని చూస్తుందీ అధికార పార్టీ బీఆర్ఎస్. ఇరు పార్టీలు వ్యుహలు.. ప్రతి వ్యుహలు మొదలు పెట్టడంతో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

ఏక్ నిరంజన్‌గా హస్తం పార్టీ నుంచి పోటికీ సై అంటున్న సీనియర్ లీడర్..!
Rajesham Goud , L Ramana , Jeevan Reddy
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 16, 2023 | 12:23 PM

Share

సీనియర్ పొలిటిషియన్ జీవన్ రెడ్డి ఒకవైపు.. ఆయన పై మూడు దశాబ్దాలుగా పోటి చేస్తున్న ప్రత్యర్ధులు మరో వైపు.. రెండు వర్గాల టార్గెట్ ఒక్కటే.. ఎన్నికల్లో ఎలాగైనా విన్నర్ అవడమే.. మరోసారి తిరిగి తన కంచుకోటలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలనేదీ జీవన్ రెడ్డి టార్గెట్. రెండోసారి విజయ పరంపర కొనసాగించాలని చూస్తుందీ అధికార పార్టీ బీఆర్ఎస్. ఇరు పార్టీలు వ్యుహలు.. ప్రతి వ్యుహలు మొదలు పెట్టడంతో జగిత్యాల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంతకీ జగిత్యాలలో జరుగుతున్న పొలిటికల్ జగడం ఏంటి? జీవన్ రెడ్డికి ప్రత్యర్థులు మారిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు..?

జగిత్యాల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఓ ప్రత్యేకత ఉంది. పబ్లిక్ మాస్ లీడర్‌గా జీవన్ రెడ్డి.. నియోజకవర్గంలో తనకంటూ ఓ క్రేజీ క్రియేట్ చేసుకున్నారు. 1983లో రాజకీయాల్లో అడుగు పెట్టిన జీవన్ రెడ్డి.. మొదటగా తెలుగు దేశం పార్టీ తరఫున బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. 1989లో కాంగ్రెస్ తరపున పోటి చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్. రమణ, తెలంగాణ స్టేట్ పైనాన్ప్ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి రాజేశం గౌడ్.. ఇద్దరూ ఒకప్పుడు జీవన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్ధులుగా తలపడిన నేతలు.

1985 ,1989 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేశం గౌడ్ తెలుగు దేశం పార్టీ నుంచి జీవన్ రెడ్డిపై రెండు సార్లు తలపడ్డారు. 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జీవన్ రెడ్డికి అనుచరుడిగా కొనసాగిన ఎల్.రమణ.. టీడీపీలో చేరి జీవన్‌రెడ్డిపై ప్రత్యర్ధిగా బరిలో దిగారు. 1994, 2009లో ఎల్.రమణ గెలుపొంది.. టీడీపీ హయంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. తెలంగాణ ఆవిర్బవం తరువాత జీవన్ రెడ్డి కి ప్రత్యర్ధిగా.. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమర్ పోటి చేశారు. 2018 ఎన్నికల్లో సంజయ్ కుమార్ విజయం సాధిస్తే.. జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధమైన నేపథ్యంలో రాజేశం గౌడ్‌తో పాటు ఎల్.రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి పదవులు దక్కించుకున్నారు. రాజేశం గౌడ్ స్టేట్ పైనాన్స్ కార్పోరేషన్ పదవి దక్కితే.. ఇటివల టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఎల్. రమణను ఎమ్మెల్సీ పదవి వరించింది.

తాజాగా రమణ, రాజేశం గౌడ్ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కావడంతో.. ఆ పార్టీ అభ్యర్థి అయిన సంజయ్ కుమార్‌ను గెలిపించే బాధ్యత అధిష్టానం వారికి అప్పగించింది. జీవన్ రెడ్డి టార్గెట్‌గా.. ముగ్గురు పాత ప్రత్యర్ధులు ప్రచారం సాగించనుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ ఆరు పర్యాయలు జగిత్యాల నుంచి విజయం సాధించిన జీవన్ రెడ్డి.. ఈ ఒక్కసారి గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. అయితే తనకు మరో చాన్స్ ఇవ్వాలంటూ ప్రచారం సాగిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇప్పుడు సంజయ్ కుమార్ కు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే బలం తోడవగా.. జీవన్ రెడ్డి ఏక్ నిరంజన్ గా హస్తం పార్టీ నుంచి పోటికీ సై అంటున్నారు. లూక్ విజువల్స్…

..జీవన్ రెడ్డి,రమణ,రాజేశం గౌడ్, సంజయ్ కుమార్ నలుగురు సీనియర్ పోలిటిషియన్లే. రాజకీయాల్లో వారికంటు ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఇక్కడ జీవన్ రెడ్డి, రమణ, రాజేశం గౌడ్ లకు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు దక్కించుకున్నారు. పూర్తిగా రాజకీయల పై పట్టున్న వారు కావడం…ఓటర్ల నాడీ పై అవగాహన ఉన్న నేతలు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రమణ,రాజేశం గౌడ్ తమ సీనియారిటికి పదును పెడుతుండగా…జీవన్ రెడ్డి తన రాజకీయ అనుభవంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. టార్గెట్ జీవన్ రెడ్డి గా సాగుతున్న బిఆర్ఎస్ ఆపరేషన్ లో…ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..