Telangana Elections: మార్పులు చేర్పులతో అభ్యర్థుల లిస్ట్ సిద్ధం చేసిన ఎంఐఎం..
ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ తన మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నాయి. ఎంఐఎం మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండు చోట్ల అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తూ లీస్ట్ సిద్ధం చేసినట్టు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చార్మినార్‌తో పాటు యాకుత్ పురలో అభ్యర్థులను మార్చే యోచనలో ఉన్నట్టు విశ్వాసనీయ సమాచారం.

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ తన మేనిఫెస్టోతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నాయి. ఎంఐఎం మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండు చోట్ల అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తూ లీస్ట్ సిద్ధం చేసినట్టు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చార్మినార్‌తో పాటు యాకుత్ పురలో అభ్యర్థులను మార్చే యోచనలో ఉన్నట్టు విశ్వాసనీయ సమాచారం. మజ్లీస్ సీనియర్ కార్యకర్తలతో పాటు ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్లు చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఇప్పటికే పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ అభ్యర్థిగా ఎవరికి పట్టం కడతారు అనేది కార్యకర్తల్లో మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. మరోవైపు ఈసారి అన్ని వర్గాలకి చెందిన మహిళలతో పాటు హిందువులకు కూడా అవకాశం కల్పిస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ, ఎంఐఎం ఈ విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇంకా అభ్యర్థుల లిస్ట్ తయారీ చేయడం వద్దే ఉండిపోయింది. దాంతో ఈ లిస్ట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ప్రచారం మొదలు పెట్టాలో అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థులకు కన్ఫర్మేషన్ అనేది నేరుగా వారికే చెప్పేస్తారు. బహిరంగంగా చెప్పే పరిస్థితి ఉండదు.
అలకలు గిలకలు జాన్తానై..
ఎంఐఎం పార్టీలో ఆలకలు, ఆందోళనలు, బుజ్జగింపులు ఏమీ ఉండవు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఓవైసీ బ్రదర్స్ తీసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దింపాయి. ఈ సారి పలు నియోజకవర్గాల్లో ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్… ఎంఐఎం వర్సెస్ బిజెపి ఊహించని విధంగా పోటీ ఉంటుంది. కొన్నిచోట్ల పాతబస్తిపై అవగాహన లేని అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడంతో ఈసారి ప్రచారం కూడా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు. నాంపల్లి, చార్మినార్‌లో ప్రచారంతో పాటు ఓటింగ్ కూడా పోటాపోటీగా ఉండబోతుంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నుంచి గత ఎన్నికల్లో పార్టీ నుంచి విభేదించి కాంగ్రెస్ పార్టీలో వెళ్లిన వ్యక్తులు కూడా తిరిగి మజ్లీస్ పార్టీలోకి వచ్చేయడంతో ఇతర పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా వస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయాల పార్టీల చూపు ఎంఐఎం వైపే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులను రంగంలోకి దింపి పోటీ చేయిస్తారో అనేదానిపై పలు పార్టీలు ఎంఐఎం వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రేపో మాపో అధికారికంగా ఓవేసి బ్రదర్స్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..