Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. ఎన్నికల నిర్వహణపై సమీక్ష అధికారుల సమీక్ష..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలెట్టింది కేంద్రం ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం.. షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్‌లో ఎన్నికల జరిగేలా సంసిద్ధతను చర్చించింది. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలెట్టింది కేంద్రం ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ముగ్గురు సీనియర్ అధికారుల బృందం.. షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్‌లో ఎన్నికల జరిగేలా సంసిద్ధతను చర్చించింది. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో ఇప్పటికే రాజకీయంగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు షురూ చేసింది. కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితేశ్ వ్యాస్ నేతృత్వంలో ముగ్గురు కేంద్ర ఎన్నికలసంఘం అధికారుల బృందం.. ప్రత్యేకంగా సమావేశమై రివ్యూ నిర్వహించింది.
ఈ సమీక్షాసమావేశంలో ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలపై చర్చించింది అధికారుల బృందం. 2023ఎన్నికల్లో.. తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష చేసింది. ఎలెక్టోరల్ అప్‌డేట్, ఈవిఎం ప్రిపేర్నెస్, పోల్ పర్సేంటేజ్ పెంచే కార్యక్రమాల పై ఆరా తీసింది. అన్ని స్థాయిల్లో పోలింగ్ అధికారులకు శిక్షణనివ్వాలని నిర్ణయించింది.
ఓటరు జాబితాలో చేర్పులు, తొలగింపులపై సమీక్షించిన ఈసీ బృందం… ఓటర్ల జాబితాను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాను సిద్ధం చేసి అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. జూన్ 1నుంచే ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీని ప్రారంభించాలనీ.. దీనిపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్‌ను షెడ్యూల్ చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని స్థాయిల అధికారులకు పటిష్టమైన శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..