Telangana Election: సోషల్‌ మీడియా ప్రచారానికి కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు.. నిఘా పెట్టిన ఎన్నికల సంఘం

సోషల్ మీడియా.. ఇదో పెద్ద వేదిక. జనాలతో కమ్యూనికేట్ అవ్వాలన్నా, మనుషులను తప్పుదారి పట్టించాలన్నా, వెబ్ దునియాలో ఉన్న మెయిన్ ప్లాట్ ఫామ్ ఇది..! మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, అరచేతిలోకి వచ్చిన అధ్బుత టెక్నాలజీ. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరూ అందిపుచ్చుకుంటున్న సాధనం.! అందుకే.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. పార్టీలు పబ్లిక్‌ వార్‌తో పాటు సోషల్‌ మీడియా వార్‌కు సైతం సై అంటున్నాయి.

Telangana Election: సోషల్‌ మీడియా ప్రచారానికి కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు.. నిఘా పెట్టిన ఎన్నికల సంఘం
Social Media
Follow us

|

Updated on: Nov 21, 2023 | 7:00 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారం కరపత్రాల నుంచి కార్పొరేట్‌ స్థాయికి చేరింది. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలతో పాటు.. సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం హోరెత్తుతోంది. పంచ్‌లు, కార్టూన్లు, స్పూఫ్‌ వీడియోలు, సర్వేలు, సవాళ్లు.. ఇలా డిజిటల్‌ ప్రచారాలతో పార్టీలు దూసుకుపోతున్నాయి. సోషల్‌ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులను ఆశ్రయిస్తూ, డిజిటల్‌ ప్రచారానికి కోట్లు కుమ్మరిస్తున్నారు. అయితే.. సామాజిక మాధ్యమాల ప్రచారంపై ఎన్నికల సంఘం ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర

సోషల్ మీడియా.. ఇదో పెద్ద వేదిక. జనాలతో కమ్యూనికేట్ అవ్వాలన్నా, మనుషులను తప్పుదారి పట్టించాలన్నా, వెబ్ దునియాలో ఉన్న మెయిన్ ప్లాట్ ఫామ్ ఇది..! మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, అరచేతిలోకి వచ్చిన అధ్బుత టెక్నాలజీ. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరూ అందిపుచ్చుకుంటున్న సాధనం.! అందుకే.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. పార్టీలు పబ్లిక్‌ వార్‌తో పాటు సోషల్‌ మీడియా వార్‌కు సైతం సై అంటున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో.. నేరుగా జరిపే ప్రచారం కంటే.. సోషల్‌ మీడియా డిజిటల్‌ ప్రచారాలే ఎక్కువుగా ఆకట్టుకుంటున్నాయి. రకరకాల పాటలు, కామెడీ స్కిట్లు, సెలబ్రిటీలతో స్టేట్మెంట్లు, కొన్ని పార్టీలు అయితే.. సోషల్ మీడియా ప్రభావితం చేసే వ్యక్తులతో.. స్టెప్పులు కూడా వేయిస్తున్నాయి.

ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార ఖర్చు 40 లక్షలు

ఎమ్మెల్యే అభ్యర్థికి రూ. 40 లక్షలు మాత్రమే ప్రచారం కోసం ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంది. ప్రచారం కోసం వాడే జెండాలు, హోర్డింగులు, టీవీ, పేపర్ అడ్వటైజ్మెంట్లతో కలిపి రూ. 40 లక్షలు దాటకూడదు. సభలు సమావేశాలు ఖర్చు కూడా ఇందులోనే ఉంటుంది. ఎన్నికల తర్వాత పోటీ చేసిన ప్రతి అభ్యర్థి, తమ ఖర్చును ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి. నిజానికి రూ. 40 లక్షల్లో ఏ అభ్యర్థి కూడా ప్రచారం ముగించలేడన్నదీ జగం ఎరిగిన సత్యం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇండిపెండెంట్ కూడా అంతకంటే ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు. కానీ.. ఎలక్షన్ కమిషన్ రాడార్‌కు దొరక్కుండా, రకరకాల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అందులో ఒకటి సోషల్ మీడియా..!

ఇక ఎలక్షన్లలో ప్రముఖంగా కనిపిస్తుంది గూగుల్ యాడ్స్. గూగుల్లో ఏది ఓపెన్ చేసినా, యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా, ముందుగా రాజకీయ పార్టీల యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇందుకు భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నాయి ఆయా పార్టీలు. తమకున్న ఎన్నారైలను వినియోగించి, అక్కడ నుంచి యాడ్స్ పబ్లిష్ చేయిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ దీన్ని లెక్కలోకి తీసుకుందామనుకున్నా… ఆ ఖర్చు వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారుతుంది.

10,000 ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లే టార్గెట్ . మరోవైపు.. సోషల్‌ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులను పార్టీలు ఆశ్రయిస్తున్నాయి. సెలబ్రిటీ అకౌంట్స్, సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్‌ బుక్‌.. వీటిల్లో కనీసం 10,000 ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లన్నింటినీ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ఈ సోషల్‌ మీడియా సెలబ్రిటీస్‌కి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి… తమకు అనుకూలంగా యాడ్స్, స్టేట్మెంట్స్ పోస్ట్ చేయిస్తున్నారు. కొంతమంది నటులతో చిన్న చిన్న వీడియోలు క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో వదులుతున్నారు. వీరికి చెల్లిస్తున్న పేమెంట్ ఎక్కడ బయటకు రాదు. ఎలక్షన్ కమిషన్ ఎంక్వయిరీ చేసిన తామే ఆ పార్టీలో ఆ అభ్యర్థిపై అభిమానంతో వీడియోలు చేస్తున్నామని చెప్తున్నారు.

సోషల్ మీడియా ఖర్చుపై ఈసీ ఆరా

ఈ క్రమంలోనే.. సామాజిక మాధ్యమాలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఎన్నికల నియమాలు దాటితే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతోంది. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు సోషల్‌ మీడియాపై చేస్తున్న ఖర్చు వివరాలను ఈసీ ఆరా తీస్తోంది. ఆ ఖర్చును అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద లెక్కించాలని ఇప్పటికే అధికారులకు సూచించింది. మొత్తానికి… సామాజిక మాధ్యం ద్వారా ఎన్నికల నియమాలు ఎవరైనా అభ్యర్ధులు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023