Telangana Election: నాడు తండ్రితో.. నేడు కొడుకుతో.. కుటుంబంతోనే కొట్లాడుతున్న యువనేత
అభ్యర్థుల ఎంపికతో పాటు ఎత్తులు పైఎత్తులతో వ్యుహలకు పదును పెడుతున్నాయి అధికార, విపక్షాలు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లాలో ఓ కీలక నేతకు చెక్ పెట్టేందుకు సిద్దం అవుతున్నారు ఆ నేత. గతంలో ఎంపీగా పోటీ చేసిన ఆ నేతను ఓడగొట్టిన ఘనత ఆ నేతది. పెద్దపల్లి జిల్లాలో ఓ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయబోతున్న ఆ నేత తనయుడిని కూడా ఓడించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట అధికార పార్టీ యువనేత.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు సవాల్‌గా స్వీకరించాయి. గెలుపే లక్ష్యంగా అగ్రనేతలు కదనరంగంలో దూసుకుపోతున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎత్తులు పైఎత్తులతో వ్యుహలకు పదును పెడుతున్నాయి అధికార, విపక్షాలు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లాలో ఓ కీలక నేతకు చెక్ పెట్టేందుకు సిద్దం అవుతున్నారు ఆ నేత. గతంలో ఎంపీగా పోటీ చేసిన ఆ నేతను ఓడగొట్టిన ఘనత ఆ నేతది. పెద్దపల్లి జిల్లాలో ఓ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయబోతున్న ఆ నేత తనయుడిని కూడా ఓడించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అధికార పార్టీ నేత. ఇంతకీ ఎవరా నేత? ఏమా నియోజకవర్గం? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఉద్యమ కాలం నుంచి పేరు సంపాదించుకున్న యువ నేత బాల్క సుమన్. ప్రస్తుతం మరోసారి చెన్నూరు నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. 2014 వరకు ఉద్యమంలో కీలకంగా వ్యవహారించిన బాల్క సుమన్, విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఏకంగా పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు సుమన్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ కీలక నేత కుమారుడిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోందట కాంగ్రెస్ అధిష్టానం.
ఇక అసలు విషయానికి వస్తే, 2014 లో బాల్క సుమన్‌పై పోటీ చేశారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. 2009 నుంచి 2014 వరకు ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి లోక్‌సభ స్థానం పోటీ చేశారు వివేక్. బాల్క సుమన్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. ఆ తర్వత 2016లో కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు వివేక్. అదే సమయంలో ఓ కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి కూడా కట్టబెట్టారు గులాబీ బాస్ కేసీఆర్. 2019 ఎన్నికల్లోనూ మరోసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో కమలం గూటికి చేరిన వివేక్.. తాజాగా మళ్లీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు రావటంతో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు వివేక్. ప్రస్తుతం ఆయన కొడుకు వంశీ కృష్ణకు కాంగ్రెస్ పార్టీ తరుఫున చెన్నూరు టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుంటే, ఎవరు పోటీ చేసినా ఓడించేందుకు సిద్దం అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఆనాడు తండ్రి వివేక్ ను ఓడించాడు. ఇప్పుడు ఆయన తనయుడు ను కూడా ఓడించి చరిత్ర సృష్టిస్తానంటున్నారు బాల్క సుమన్. తండ్రి,కుమారుల ఓటమి నా చేతిలోనే అన్న ధీమాతో ఉన్నారట బాల్క సుమన్. ఏదేమైనా ఎన్నికల వేళ పెద్దపల్లి జిల్లాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో వివేక్ కొడుకు ఓడుతారా? గెలుస్తారో లేదో వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
