Sabitha Indra Reddy: డ్రగ్స్ నివారణకు పకడ్బందీ చర్యలు.. ర్యాగింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తాం.. మంత్రి వార్నింగ్..

విద్యాలయాల్లో డ్రగ్స్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. డ్రగ్స్ క్రమంగా విద్యాసంస్థల్లోకి చాప కింద నీరులా విస్తరిస్తున్నాయని ఆందోళన...

Sabitha Indra Reddy: డ్రగ్స్ నివారణకు పకడ్బందీ చర్యలు.. ర్యాగింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తాం.. మంత్రి వార్నింగ్..
Sabitha Indra Reddy
Follow us

|

Updated on: Jan 11, 2023 | 3:11 PM

విద్యాలయాల్లో డ్రగ్స్ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. డ్రగ్స్ క్రమంగా విద్యాసంస్థల్లోకి చాప కింద నీరులా విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్న ఆమె.. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నిరోధానికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించాచరు. అమ్మాయిలను వేధించేందుకు ఆకతాయిలు ఎన్నో రకాలుగా వ్యవహరిస్తుంటారని.. బాధిత అమ్మాయిలు షీ టీమ్ లకు పిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలేజీల్లో ర్యాగింగ్ జరిగితే తీవ్రంగా తీసుకుంటామని.. అవసరమైతే కమిటీలు వేసి మరీ కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా హెచ్చరించారు.

విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలి. మట్టిలో మాణిక్యాలు ఉంటారని వారు. వారిని సాన బెడితే అణిముత్యాలు లాంటి విద్యార్థులు బయటకు వస్తారు. గతంలో అమ్మాయిలను చదివించటం కష్టంగా ఉండేది. ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల వల్ల నేడు విశ్వవిద్యాలయాలు అమ్మాయిలతో నిండి పోయాయి. ఓయూలో 70 శాతం, కాకతీయ యూనివర్సిటీ లో 80 శాతం విద్యార్థినిలు ఉన్నారు. విద్యార్థులకు చదువును మించిన ఆస్తి ఏమి లేదు.

       – సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

బాగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని మంత్రి సబిత సూచించారు. గురుకులాలు, కేజీబీవీ పాఠశాలలు నెలకొల్పి వాటిని ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేశారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యారంగానికి పెద్దపీట వేశారని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి