Khammam District: రోడ్డుపై వెళ్తున్న కారుకు ఒక్కసారిగా అడ్డు వచ్చిన గేదెలు.. దీంతో పక్కకు తప్పించగా
ప్రమాదాలు ఎలాగైన సంభవించవచ్చు. గేదెలు లేదా ఇతర జంతువులు అడ్డు వచ్చినప్పుడు మనం ఎవర్నీ నిందించలేం. అందుకే పరిమిత వేగంతో వెళ్తే.. ప్రాణాలు దక్కించుకోవచ్చు.
ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, వెంగన్నపేట గ్రామం పరిధిలో ప్రమాదం తప్పింది. దారి వెంబడి వెళ్తోన్న ఒక కారుకు సడెన్‌గా గేదెలు అడ్డొచ్చాయి. ఇంతలో ఏం చేయాలో పాలు పోక.. పక్కకు తప్పిచాడా డ్రైవర్. దీంతో ఆ పక్కనే ఉన్న బావిలో పడిపోయింది కారు.
అచ్చం సినిమా ఫక్కీలో జరిగిన ఈఘటనలో కారు డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. బావి లోతు చిన్నది కావడం.. వేగం కూడా తక్కువ కావడంతో.. తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కారును బావిలోంచి తీసే యత్నం చేస్తున్నారు స్థానికులు.
బావిలో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే నీట మునిగిపోయి నిండు ప్రాణం బలైపోయి ఉండేది. రోడ్డుపై గేదెలు, ఇతర జీవాలు తోలుకెళ్లేవారికి కూడా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. కొందరు అయితే వాహనాలు తిరుగుతున్నా కానీ వాటిని కనీసం పక్కని వాళ్లే గద్దించరు. వాళ్ల బాధ వాళ్లు పడతారులే అని వదిలేస్తారు. దీంతో వాహనదారులు పలుసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిగో ఇలాంటి ప్రమాదాలు కూడా జరుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి