Watch Video: ఇద్దరు విద్యార్థినులకు లిఫ్ట్ ఇచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
Minister Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను స్వయంగా తన కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దించారు. ఇక మంత్రి గారే స్వయంగా తమ గ్రామానికి, ఇళ్లకు రావడంతో ఆ గ్రామస్తులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం నాడు మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్నారు.
Minister Sabitha Indra Reddy: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను స్వయంగా తన కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దించారు. ఇక మంత్రి గారే స్వయంగా తమ గ్రామానికి, ఇళ్లకు రావడంతో ఆ గ్రామస్తులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం నాడు మహేశ్వరం మండలం గొల్లురు నుండి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఆ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులను గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపించిన మంత్రి సబిత.. చిన్నారులతో మాట్లాడారు. కారులో వస్తారా అని అడుగగా వెంటనే వారు సరే అన్నారు. దాంతో వారిని మంత్రి తన కారులోనే ఎక్కించుకొని, చాక్లేట్లు అందించి, వారి ఇంటి వద్ద డ్రాప్ చేశారు. గొల్లూరు నుండి తండా వరకు వారితో మాట్లాడుతూ ఏం చదువుతున్నారని, ఇతర బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు మంత్రి. అనంతరం వారిని ఇంటి వద్ద దింపిన తరువాత.. వారి తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడారు మంత్రి. అయితే, మంత్రి సబిత తమ గ్రామానికి, తమ ఇళ్లకు రావడంతో ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.