TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ అప్లికేషన్ గడువు పెంపు.. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..
TS EAMCET 2021: తెలంగాణలో ఎంసెట్ అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని టీఎస్ ఎంసెట్..

TS EAMCET 2021: తెలంగాణలో ఎంసెట్ అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఇప్పటి వరకు ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విభాగంలో 1,35,151 అప్లికేషన్స్ రాగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌లో 66,216 దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తంగా 2,01,367 మంది అభ్యర్థులు ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఎంసెట్ అప్లికేషన్స్‌కు గడువు పొడగించారు. జూన్ 3వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో టీఎస్ ఎంసెట్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని కన్వీనర్ వెల్లడించారు.

Ts Eamcet 2021
Also read:
