AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime News: సెక్యూరిటీ గార్డ్​… యూట్యూబ్ వీడియోలు చూసి మీసేవా పోర్టల్ హ్యాక్ చేశాడు

క్రైమ్ కొత్త పుంత‌లు తొక్కుతుంది. టెక్నాలజీని నేరాల‌కు అడ్డాగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. పక్కా స్కెచ్ వేసి.. నిలువునా దోచేస్తున్నారు. తాజాగా..

Telangana Crime News:  సెక్యూరిటీ గార్డ్​... యూట్యూబ్ వీడియోలు చూసి మీసేవా పోర్టల్ హ్యాక్ చేశాడు
Mee Seva Hack
Ram Naramaneni
|

Updated on: May 26, 2021 | 9:14 PM

Share

క్రైమ్ కొత్త పుంత‌లు తొక్కుతుంది. టెక్నాలజీని నేరాల‌కు అడ్డాగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. పక్కా స్కెచ్ వేసి.. నిలువునా దోచేస్తున్నారు. తాజాగా మీసేవా పోర్టల్ వివరాలు హ్యాక్ చేసి పలు సేవల ద్వారా వచ్చే కమీషన్లను కాజేసిన ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డిని విచారించ‌గా.. దిమ్మ‌తిరిగే విష‌యాలు వెల్ల‌డించాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. వరంగల్​కి చెందిన కాసాని జగన్ నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ.. జీవినం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విలాసాలకు అవాటుపడి.. ఈజీ మ‌నీ కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బైక్‌పై ఉన్న చలాన్లు కట్టడానికి మీ సేవ సెంటర్​కు వెళ్లినపుడు లాగిన్ వివరాలు తస్కరించాడు. తన ఫ్రెండ్స్ నుంచి కొంత స‌మాచారం సేక‌రించి, యూట్యాబ్​లోని వీడియోల ద్వారా మీ సేవా పోర్టర్​లో లాగిన్ అయ్యాడు. ఈసీ లాంటి పలు కీలక డాక్యుమెంట్లు నుంచి వచ్చే కమీషన్​ను తన అకౌంట్ల‌కు మళ్లించుకున్నాడు. తన ఐడీ ద్వారా ఇదంతా జరిగిందని తెలుసుకున్న మీసేవా ఉద్యోగి పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైం టీమ్ రంగంలోకి దిగింది. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. చూశారుగా ఏకంగా అంత సెక్యూరిటీ ఉంటే.. మీ సేవా పోర్ట‌ల్ నే హ్యాక్ చేశాడు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. లేక‌పోతే మ‌న జీవితాలు కూడా రోడ్డున ప‌డిపోతాయ్.

Also Read:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా ఉన్నాయి

వచ్చే నెలలో ఏపీలో అమలు కానున్న పథకాలు ఇవే.. ప్రకటించిన సీఎం జ‌గ‌న్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!