Telangana: ఆ మందుల్లో చాక్ పౌడర్, గంజి.. డీసీఏ దర్యాప్తులో సంచలన విషయాలు..
తాజాగా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ సంచలన విషయాలను తెలిపింది. చాక్ పౌడర్, గంజిని ఉపయోగించి ఓ ముఠా నకిలీ ట్యాబ్లెట్స్‌ను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. జీరో మెడిసిన్‌తో తయారు చేస్తున్న మందులను మెడికల్ షాపులకు సప్లై చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. మెగ్ లైఫ్‌సైన్సెస్...
మోసం జరగని చోటును లేదన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. మార్కెట్లో లభించే ప్రతీ వస్తువులు నకిలీ తయారవుతున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు నకిలీ చేస్తూ ప్రజల జీవితాలో చెలగామాటుడుతున్నారు కేటుగాళ్లు. అయితే అనారోగ్యం బారిన పడితే ఉపయోగించే మందులను కూడా వదలడం కొందరు నకిలీ రాయుళ్లు. ఏకంగా మెడిసిన్స్‌ను కూడా నకిలీ చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ సంచలన విషయాలను తెలిపింది. చాక్ పౌడర్, గంజిని ఉపయోగించి ఓ ముఠా నకిలీ ట్యాబ్లెట్స్‌ను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. జీరో మెడిసిన్‌తో తయారు చేస్తున్న మందులను మెడికల్ షాపులకు సప్లై చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. మెగ్ లైఫ్‌సైన్సెస్ పేరుతో విక్రయిస్తున్న నకిలీ మందులను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది. అసలు ఆ పేరుతో కంపెనీయే ఉనికిలో లేదని తేల్చి చెప్పింది.
డీసీఏ దర్యాప్తులో పలు సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాక్ పౌడర్, గంజితో తయారు చేస్తున్న నకిలీ మెడిసిన్‌ను మార్కెట్లోకి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నట్లు తేలింది. ఇందులో భాగంగా డీసీఏ మొత్తం రూ. 33.5 లక్షల విలువైన నకిలీ మందులను సీజ్ చేసింది. అస్సలు ఎక్కడా అనుమానం రాకుండా ఈ నకిలీ మందులను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయమై డ్రగ్ కంట్రోలర్ ప్రజలను అలర్ట్ చేసింది. ఈ మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని ప్రజలకు, మెడికల్ షాపుల నిర్వాహకులకు సూచించింది.
ఈ ట్యాబ్లెట్లతో ఆరోగ్యానికి హానికరమని చెబుతున్న అధికారులు మెడిసిన్‌ను డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ యాంటీ బయోటిక్స్‌ను వైరల్ ఫీవర్లు, ఇతర తీవ్రమైన వ్యాధులకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ మందుల తయారీతో సంబంధం ఉన్న పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..