CM Revanth: మా కుటుంబంలో ఎవరూ పోటీచేయడం లేదు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడు అని కేసీఆర్ నుద్దేశించి మాట్లాడారు. ఐదు నెలల్లో నన్ను దించుతానంటున్నారని, నన్ను దించాలంటే కేసీఆర్ మోదీతో కలిసిన సాధ్యం కాదన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడు అని కేసీఆర్ నుద్దేశించి మాట్లాడారు. ఐదు నెలల్లో నన్ను దించుతానంటున్నారని, నన్ను దించాలంటే కేసీఆర్ మోదీతో కలిసిన సాధ్యం కాదన్నారు. నేను మోదీని పెదన్న అన్నందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు రచ్చ చేస్తున్నారని, ఆయన ప్రధాని కాబట్టి పెద్దన్న అన్నా అన్నానని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అయితే మోదీతో అభివృద్ధిపై మాత్రమే చర్చించానని, కేసీఆర్‌లా గదిలోకి వెళ్లి చెవిలో చెప్పలేదు లేదని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను కేసీఆర్ వందేళ్ల వరకు కోలుకోకుండా విధ్వంసం చేశారని రేవంత్ కేసీఆర్ పై మండిపడ్డారు.
ఇక మేడిగడ్డ విషయమై రేవంత్ మాట్లాడుతూ.. మేడిగడ్డపై NDSAకు లేఖ రాశామని, నాలుగు నెలల్లో నివేదిక ఇస్తామంటున్నారని, — నాలుగు రోజుల్లో కూడా నివేదిక ఇవ్వొచ్చు అని రేవంత్ అన్నారు. కాళేశ్వరం సంబంధించి అవినీతిలో 99 శాతం అధికారుల భాగస్వామ్యం ఉందని, విచారణ జరపాలంటే అధికారుల కొరత ఉందని రేవంత్ తేల్చి చెప్పారు.
ఇక పార్లమెంట్ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. ఈనెల 7, 8న తొలి జాబితా ఉంటుంది అని, మా కుటుంబంలో ఎవరూ పోటీచేయరని, — అలాంటివి నేను ఎంకరేజ్ చేయను అని రేవంత్ అన్నారు. వంద రోజుల్లో మా పరిపాలన చూసి ఓటు వేయాలని, రాహుల్ గాంధీ పోటీ చేయాలని కోరుతున్నామని, ఆయన గెలిస్తే రుణం తీర్చుకున్నట్లు అవుతుంది రేవంత్ అన్నారు.