Telangana Night Curfew: తెలంగాణలో నేటితో ముగియనున్న నైట్‌ కర్ఫ్యూ.. మళ్లీ పొడిగిస్తారా..?

Telangana Night Curfew: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ప్రతి రోజు మరణాలు తక్కువగా ఉన్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో

Telangana Night Curfew: తెలంగాణలో నేటితో ముగియనున్న నైట్‌ కర్ఫ్యూ.. మళ్లీ పొడిగిస్తారా..?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 30, 2021 | 2:17 PM

Telangana Night Curfew: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ప్రతి రోజు మరణాలు తక్కువగా ఉన్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక రాష్ట్రంలో శుక్రవారం రాత్రి పూట కర్ఫ్యూ ముగియనుంది. కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవారం రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చీఫ్‌ సెక్రటరీ ఈరోజు ప్రకటన వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా చికిత్స జరుగుతోంది. కోలుకున్నాక అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమీక్ష జరుపనున్నారు. పరిస్థితిని బట్టి మరో వారం తరువాత మరిన్ని ఆంక్షలపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే నైట్ కర్ఫ్యూ విధిస్తే ఎన్ని రోజులు పొడిగిస్తారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 10శాతం పాజిటివిటి కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ లను ఏర్పాటు చేసి మినీ లాక్ డౌన్ విధించాలని పేర్కొన్నది. దాని ప్రకారమే చేస్తారా? లేదా మహానగరంలో కేసుల ఉద్ధృతి పెరుగుతుండటంతో హైదరాబాద్ వరకు లాక్ డౌన్ విధిస్తారా? అనేది తెలియాలి.

ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై లాక్‌డౌన్‌ విధిస్తారేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించేది లేదని స్పష్టం చేశారు.

ఇవీ కూడా చదవండి:

SSC, Inter Eaxms: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

Justin Trudeau: భారత్‌కు కెనడా భారీ సాయం .. ప్రకటించిన ఆ దేశ ప్రధాని .. ఎంతంటే..!

Covid-19 Effect: కరోనా విలయతాండవం.. పోలీసులను బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారి.. కోవిడ్‌తో 42 మంది పోలీసులు మృతి