Telangana Corona: తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,260 సాంపిల్స్ పరీక్షించగా.. 691 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా
Telangana Corona
Follow us

|

Updated on: Jul 21, 2021 | 9:40 PM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,14,260 సాంపిల్స్ పరీక్షించగా.. 691 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,38,721 మంది కరోనా బారిన పడ్డారు. ఇక ఒక్క రోజులో 565 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 6,25,042 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా ఒక్క రోజులో నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో 3,771 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రికవరీ రేటు97.85 శాతం ఉంది. మరణాట రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 9,908 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నమోదు అయ్యాయి. ఆ తరువాతి స్థానంలో జీహెచ్ఎంసీలో 85 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 2, బద్రాద్రి కొత్తగూడెం – 23, జీహెచ్ఎంసీ – 85, జగిత్యాల – 26, జనగామ – 10, జయశంకర్ భూపాలపల్లి – 9, జోగులాంబ గద్వాల – 3, కామారెడ్డి – 0, కరీంనగర్ – 55, ఖమ్మం – 56, కొమరంభీం ఆసిఫాబాద్ – 7, మహబూబ్‌నగర్ – 8, మహబూబాబాద్ – 19, మంచిర్యాల – 37, మెదక్ – 1, మేడ్చల్ మల్కాజిగిరి – 30, ములుగు – 9, నాగర్ కర్నూలు – 5, నల్లగొండ – 38, నారాయణ పేట – 2, నిర్మల్ – 3, నిజామాబాద్ – 7, పెద్దపల్లి – 42, రాజన్న సిరిసిల్ల – 19, రంగారెడ్డి – 29, సంగారెడ్డి – 7, సిద్ధిపేట – 18, సూర్యాపేట – 47, వికారాబాద్ – 5, వనపర్తి – 9, వరంగల్ రూరల్ – 25, వరంగల్ అర్బన్ – 41, యాదాద్రి భువనగిరి – 14 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, కామారెడ్డిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ జిల్లాల అధికారుల పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతానికి కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని హితవు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

ఇవి కూడా చదవండి: TTD: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీ

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో