AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 465 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా

తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతోంది. కొత్తగా   24 గంటల వ్యవధిలో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 465 కొత్త కేసులు వెలగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు..

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 465 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా
Sanjay Kasula
|

Updated on: Jul 11, 2021 | 6:47 PM

Share

తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతోంది. కొత్తగా   24 గంటల వ్యవధిలో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 465 కొత్త కేసులు వెలగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,31,683కు చేరింది. 24 గంటల వ్యవధిలో 4గురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,729కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.  తాజాగా 869 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,17,638కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,316 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి.

జిల్లాల వారీగా తాజా క‌రోనా పాజిటివ్ కేసుల వివ‌రాలిలా ఉన్నాయి..

ఆదిలాబాద్‌-1, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-23, జీహెచ్ఎంసీ-70, జ‌గిత్యాల‌-13, జ‌న‌గాం-3, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-14, జోగులాంబ గ‌ద్వాల‌-3, కామారెడ్డి-0, క‌రీంన‌గ‌ర్‌-42, ఖ‌మ్మం-32, కొమురంభీం ఆసిఫాబాద్‌-4, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-7, మ‌హ‌బూబాబాద్‌-8, మంచిర్యాల‌-25, మెద‌క్‌-3, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-20, ములుగు-09, నాగ‌ర్‌క‌ర్నూలు-6, న‌ల్ల‌గొండ‌-14, నారాయ‌ణ‌పేట‌-0, నిర్మ‌ల్‌-1, నిజామాబాద్‌-11, పెద్ద‌ప‌ల్లి-14, రాజ‌న్న సిరిసిల్ల‌-12, రంగారెడ్డి-23, సంగారెడ్డి-07, సిద్దిపేట‌-21, సూర్యాపేట‌-33, వికారాబాద్‌-2, వ‌న‌ప‌ర్తి-5, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-5, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-15, యాదాద్రి భువ‌న‌గిరి-1.

ఇవి కూడా చదవండి: Anti-Terrorist Squad: యూపీలో టెన్షన్.. టెన్షన్.. ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు.. ఆపరేషన్ మొదలు పెట్టిన ATS దళాలు

L.Ramana – TRS: కారెక్కేందుకు అంతా రెడీ.. సోమవారం మంత్రి KTR చేతుల మీదుగా TRS సభ్యత్వం తీసుకోనున్న L. రమణ