AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తొలి విడతలో కాంగ్రెస్ ఎంత మంది అభ్యర్థులను ప్రకటించబోతుందో తెల్సా..?

కొన్ని స్థానాల్లో గెలుపు గుర్రాలకి టికెట్స్ ఇవ్వాలంటే సీనియర్లను పక్కన పెట్టక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. మరికొన్నిచోట్ల ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నప్పటికీ.. దాన్ని క్యాష్ చేసుకొని గెలవగలిగే దమ్మున్న క్యాండిడేట్లు లేకపోవడం పార్టీని సందిగ్ధంలో పడేస్తోంది. పటాన్ చెరువు లాంటి నియోజకవర్గం అందుకు ఉదాహరణ. ఇక అంబర్‌పేట్ ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలని వీహెచ్ పట్టుబడుతూ ఉండగా.. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్ యాదవ్ అక్కడ గెలిసే అవకాశం ఉందని సునీలు కనుగోలు సర్వే రిపోర్ట్‌లో వచ్చింది.

Telangana: తొలి విడతలో కాంగ్రెస్ ఎంత మంది అభ్యర్థులను ప్రకటించబోతుందో తెల్సా..?
Telangana Congress
Sravan Kumar B
| Edited By: |

Updated on: Sep 24, 2023 | 3:48 PM

Share

తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ వేగంగానే అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణంగానే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్స్ నిర్వహిస్తోంది. ఒకానొక టైంలో 119 అభ్యర్థులను ఒకేసారి టిఆర్ఎస్ మాదిరిగా ఎందుకు ప్రకటించకూడదని కూడా ఆలోచన చేసింది. అయితే విడతల వారీగానే అభ్యర్థులను ప్రకటించడం మంచిదని నిర్ణయించుకుంది. దశలవారీగా అభ్యర్థులను ప్రకటించడమే ఉత్తమని నిర్ణయించటానికి పలు కారణాలు ఉన్నాయి. రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు లాంటి గన్ షాట్ సీనియర్ లీడర్స్ ఖచ్చితంగా గెలిచి తీరుతారు కాబట్టి అలాంటి వారిని సుమారు ఒక 30 మంది లిస్టును తయారు చేసింది. అయితే మిగిలిన చోట్ల అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎన్నో సవాళ్లు తప్పడం లేదు. కొంతమంది సీనియర్ నాయకులు ఓడిపోతారని పార్టీ సర్వే రిపోర్ట్‌లో వచ్చింది. కానీ సీనియర్లు మేమే రంగంలోకి దిగుతామనే  పట్టుబట్టడం. మరోవైపు అక్కడ రిపోర్టులు తమకు అనుకూలంగా వచ్చింది కాబట్టి తమకు కేటాయించాలని ఆశావహులు డిమాండ్ చేయడం కాస్త ఇబ్బందిగా మారింది.

కొన్ని స్థానాల్లో గెలుపు గుర్రాలకి టికెట్స్ ఇవ్వాలంటే సీనియర్లను పక్కన పెట్టక తప్పని పరిస్థితి. మరికొన్నిచోట్ల ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నప్పటికీ.. దాన్ని క్యాష్ చేసుకొని గెలవగలిగే దమ్మున్న క్యాండిడేట్లు లేకపోవడం పార్టీని సందిగ్ధంలో పడేస్తోంది. పటాన్ చెరువు లాంటి నియోజకవర్గం అందుకు ఉదాహరణ. అంబర్‌పేట్ ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలని విహెచ్ పట్టుబడుతూ ఉండగా.. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్ యాదవ్ అక్కడ గెలిసే అవకాశం ఉందని సునీలు కనుగోలు సర్వే రిపోర్ట్‌లో వచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరోపక్క విహెచ్ ఎమ్మెల్యే టికెట్ తనకు వదిలేసి.. శ్రీనివాస్ యాదవ్‌ని ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని వినికిడి. మరోపక్క కొంతమంది సీనియర్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకోకపోయినా వారి పేర్లను కూడా కొన్ని చోట్ల పరిశీలిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకు కారణం గెలిచే ఛాన్స్ ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని కాంగ్రెస్ భావించడం.

119 అభ్యర్థులను ఒకటేసారి ప్రకటిస్తే టికెట్లు దక్కని వారి అసమ్మతి సెగలు కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేస్తాయేమో అన్న ఆలోచన. అంతమందిని ఒకేసారి సముదాయించడం కష్ట సాధ్యమైన పని. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇతర పార్టీల్లోని సీనియర్ నాయకులు భారీగా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని భావిస్తున్న కాంగ్రెస్ అందరినీ ఇప్పుడే ప్రకటిస్తే వచ్చే సీనియర్లను యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఇతర పార్టీ సీనియర్లను చేజార్చుకోవద్దంటే అభ్యర్థులను విడుదలవారీగా ప్రకటించడమే ఉత్తమమని కాంగ్రెస్ భావించింది. అందుకే మొదటి విడతలో కాంగ్రెస్ సుమారు 70 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.