Telangana: ‘రూ.15వేల కోట్లు ఇప్పిస్తా.. కానీ ఒక కండీషన్’.. తెలంగాణ సర్కార్‌కి రేవంత్ బంపర్ ఆఫర్..

తెలంగాణలో రింగ్‌రోడ్‌ టోల్ టెండర్‌పై రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ప్రధానం అస్త్రంగా మార్చుకున్నాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి ఓపెన్‌ ఆఫర్‌ అంటూ సవాల్‌ విసిరారు. ఇంతకీ.. ఏంటా రేవంత్‌ ఆఫర్‌? అసలు.. టెండర్ల రగడకు కారణాలేంటి?

Telangana: ‘రూ.15వేల కోట్లు ఇప్పిస్తా.. కానీ ఒక కండీషన్’..  తెలంగాణ సర్కార్‌కి రేవంత్ బంపర్ ఆఫర్..
Revanth Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: May 05, 2023 | 8:29 AM

తెలంగాణలో రింగ్‌రోడ్‌ టోల్ టెండర్‌పై రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ప్రధానం అస్త్రంగా మార్చుకున్నాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి ఓపెన్‌ ఆఫర్‌ అంటూ సవాల్‌ విసిరారు. ఇంతకీ.. ఏంటా రేవంత్‌ ఆఫర్‌? అసలు.. టెండర్ల రగడకు కారణాలేంటి?

తెలంగాణలో రాజకీయంగా మరో కొత్త పంచాయతీ కొనసాగుతోంది. ఓఆర్ఆర్ టోల్ టెండర్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. టెండర్‌లో అవకతవకలు జరిగాయంటూ లెక్కలతో వివరించే ప్రయత్నం చేశారు టీపీసీసీ చీఫ్‌. దానిలో భాగంగా.. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు రేవంత్‌. ఓఆర్‌ఆర్‌ను ప్రభుత్వమే మెయింటేన్‌ చేస్తే.. బ్యాంకుల నుంచి 15వేల కోట్లు ఇప్పిస్తానని స్విస్‌ చాలెంజ్‌ విసిరారు.

టెండర్‌ విషయంలో కేసీఆర్‌ కానీ.. కేటీఆర్‌ కానీ.. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. అవకతవకల విషయాన్ని వదిలిపెట్టేదిలేదన్నారు. టెండర్‌ను వెంటనే రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు రేవంత్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. రింగ్‌ రోడ్డు టెండర్ల విషయంలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్‌రెడ్డి పోరు సాగిస్తున్నారు. అయితే.. రేవంత్‌రెడ్డి విసిరిన.. ఓపెన్‌ ఆఫర్‌ సవాల్‌పై సర్కార్‌ పెద్దలు కానీ, అధికారులు కానీ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..