CM KCR Nalgonda Tour: మరికాసేపట్లో నల్గొండ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్..!

CM KCR Tour : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.

CM KCR Nalgonda Tour: మరికాసేపట్లో నల్గొండ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్..!
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 29, 2021 | 10:52 AM

CM KCR Nalgonda Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ తండ్రి ఇటీవల మరణించారు. దీంతో ఆయన కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు. మారయ్య చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినథ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గాదరి కిషోర్‌ కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు గతంలో సీఎం కేసీఆర్‌ పార్లమెంటరీ సెక్రటరీగా నియమించి వైద్యారోగ్య శాఖ బాధ్యతలను అప్పగించారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి నల్గొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గాదరి కిశోర్‌ ఇంటికి చేరుకుంటారు. ఎమ్మెల్యేను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి…తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. మరోవైపు, కేసీఆర్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, అధికారులు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రాజేశ్వరి కలిసి హెలిప్యాడ్‌ పనులను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Read Also…  Modi Cabinet: ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఓమిక్రాన్, 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన చర్చ!