Modi Cabinet: ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఓమిక్రాన్, 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన చర్చ!

Union CAbinet Meet: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్, వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు.

Modi Cabinet: ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ఓమిక్రాన్, 5 రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాన చర్చ!
Pm Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 29, 2021 | 10:37 AM

PM Narendra Modi to hold Council of Ministers Meet: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్, వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. ఓమిక్రాన్ వేరియంట్‌తో పాటు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

గత గురువారం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ మహమ్మారి పరిస్థితిని సమీక్షించారు. ఓమిక్రాన్ వ్యాప్తికి సంబంధించి అధిక స్థాయి అప్రమత్తంగా ఉండాలని ప్రధాని అధికారులను కోరారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కనీసం మూడు రెట్లు ఎక్కువ వ్యాప్తి చెందుతుందని గతంలో కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం. అదే సమయంలో వార్‌రూమ్‌లను యాక్టివేట్ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. పెరుగుతున్న కొవిడ్ కేసులను విశ్లేషిస్తూ, జిల్లా, స్థానిక స్థాయిలో నివారణ కోసం కఠినమైన సత్వర చర్య తీసుకోవాలని సూచించింది.

ఇప్పటివరకు, భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో 664 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో 186 మంది ఆరోగ్యవంతులయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 167 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 46 కేసులు వెలుగచూశాయి. మరోవైపు మరికొద్ది రోజుల్లోనే కొవిడ్ 19 వృద్ధి రేటులో భారతదేశం వేగవంతం కావచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదిక మంగళవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించనున్న కేంద్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఓమిక్రాన్ రోజువారీ కేసులలో భారతదేశం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కేసుల వేగవంతమైన పెరుగుదల సమయం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత వారం, భారతదేశం బూస్టర్ డోసులను అనుమతించింది. టీకా ప్రచారంలో 15 18 సంవత్సరాల మధ్య యుక్తవయస్కులు ఉన్నారు. ఇందుకోసం మెర్క్ & కో.. యాంటీవైరల్ పిల్ మొల్లూపిరవిర్, మరో రెండు వ్యాక్సిన్‌లతో పాటు, స్థానిక డ్రగ్ రెగ్యులేటర్ మంగళవారం ఆమోదించింది.

అదే సమయంలో, దేశంలో ఇచ్చిన యాంటీ కోవిడ్ 19 వ్యాక్సిన్ల డోస్‌ల సంఖ్య మంగళవారం నాటికి 143 కోట్లకు చేరుకుంది. జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారం ప్రారంభించింది కేంద్రం. ఇందులో మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఫిబ్రవరి 2 నుండి టీకాలు వేయడం ప్రారంభమైంది. కోవిడ్ 19 టీకా తదుపరి దశ మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడినవారు అనంతరం 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ప్రారంభమైంది. దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి టీకాలు వేయడం ప్రారంభించింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయడానికి ప్రభుత్వం అనుమతించింది.

Read Also…  Omicron: అలర్ట్‌..! ఒమిక్రాన్‌కి సంబంధించి WHO 7 హెచ్చరికలు జారీ..?