AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన!

CM KCR Warangal tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు.

CM KCR tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన!
Balaraju Goud
|

Updated on: Jan 17, 2022 | 5:22 PM

Share

Telangana CM KCR Warangal tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారి పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు. ఇవాళ జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కరోనా కట్టడితో పాటు పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా అకాల వర్షాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో..ఆ జిల్లాలో పర్యటించి.. పంట నష్టాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతులను నిండా ముంచిన సంగతి తెలిసిందే. ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు నష్టపోయారు. ఇప్పటికే పత్తి పంట దిగుబడి తగ్గిపోవడంతో దిగులుతో ఉన్న రైతులపై రబీ సీజన్‌ ప్రారంభంలో కురిసన వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.

ఈ నేపథ్యంలోనే హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నేను స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాల దగ్గరకు వస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి.

Read Also…  Budget 2022: కరోనాతో మారుతున్న అంచనాలు.. వచ్చే బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి ఎసరు!