AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం.. కోవిడ్ పరిస్థితులు, వానాకాలం ధాన్యం కొనుగోలు, పంట నష్టంపై చర్చ!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం (Telangana Cabinet Meeting) కొనసాగుతోంది.

TS Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం.. కోవిడ్ పరిస్థితులు, వానాకాలం ధాన్యం కొనుగోలు, పంట నష్టంపై చర్చ!
Balaraju Goud
|

Updated on: Jan 17, 2022 | 5:50 PM

Share

Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (CM KCR)అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం (Telangana Cabinet Meeting) కొనసాగుతోంది. తెలంగాణలో కొవిడ్ పరిస్థితులు(Covid Situation), నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఆసుపత్రుల్లోని వస‌తులు, ఆక్సిజన్‌, మందుల లభ్యత, వ్యాక్సి‌నే‌షన్‌ (Vaccination)ప్రక్రియతో పాటు అకాల వర్షాలు, పంట నష్టం(Crop loss), రైతాంగానికి చేయూత వంటి అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. వీటితో పాటు కొత్త జోనల్‌ వ్యవస్థ(Zonal System) ప్రకారం జిల్లాల, జోన్ల కేటా‌యిం‌పులు పూర్తయిన నేప‌థ్యంలో వచ్చిన అప్పీళ్లపై కూడా కేబినెట్‌ చర్చిస్తోంది. ఉద్యో‌గాల ఖాళీలు, నోటి‌ఫి‌కే‌షన్ల ప్రక్రియ తది‌తర అంశా‌లపై కూడా కేబినెట్‌లో (Cabinet) చర్చ సాగుతున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే, కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నిత్యం కొత్త కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. అయితే ఇప్పటికే కొవిడ్ తీవ్రత, నియంత్రణపై చర్యలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. తెలంగాణలో కరోనా మహమ్మారి పరిస్థితులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌కు వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణలో కొవిడ్ నియంత్రణలోనే ఉందంటూ హరీశ్‌రావు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణవ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి వివరించారు. ఇప్పటికే ఐదుకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే కొవిడ్‌ను నియంత్రించవచ్చని మంత్రి పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. స్కూళ్లు, కాలేజీల సెలవులను ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.

ఇదిలావుంటే, వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేబినెట్ దృష్టికి పూర్తి వివరాలను అందించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కావచ్చిందని, అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకాకూడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదని, దీనిని దృష్ణిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తిగా అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఇదిలావుంటే, తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతులను నిండా ముంచిన సంగతి తెలిసిందే. ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు నష్టపోయారు. ఇప్పటికే పత్తి పంట దిగుబడి తగ్గిపోవడంతో దిగులుతో ఉన్న రైతులపై రబీ సీజన్‌ ప్రారంభంలో కురిసన వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం ముఖ్యమంత్రి పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించాలని నిర్ణయించారు.

Read Also… CM KCR tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన!