Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం..

Telangana Cabinet: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కోవిడ్..

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం..
Cm Kcr
Follow us

|

Updated on: Aug 01, 2021 | 5:22 PM

Telangana Cabinet: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కోవిడ్ పరిస్థితులు, వైద్యం, మెడికల్ కాలేజీల ఏర్పాటు, వ్యవసాయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు నియమించారు.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై కేబినెట్‌లో చర్చ జరుగుతోంది. దేశంలో పలు రాష్ట్రాల పరిస్థితి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై మంత్రివర్గం సుధీర్ఘంగా చర్చిస్తోంది.

జిల్లాల్లో కరోనా కేసుల తీరుపై చర్చ.. కాగా, ఈ సమావేశంలో ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి సవివరంగా కేబినెట్ కు సమాచారం అందించారు వైద్యాధికారులు. ఆయా జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సీజన్, మందులు, బెడ్స్, తదితర ఔషదాల లభ్యతపై మంత్రివర్గం విస్తృతంగా చర్చిస్తున్నారు. అన్ని జిల్లాల్లో భారీగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది. నూతనంగా మంజూరు చేసిన ఏడు మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పన పైనా కేబినెట్ చర్చించింది. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావలసిన నిర్మాణాలను చేపట్టాలని, వసతులను సత్వరమే ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది.

కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్..

అలాగే.. కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై కేబినెట్ చర్చించింది. వీటి సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై చర్చించారు. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్, చెస్ట్ హాస్పటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బినగర్ గడ్డి అన్నారం, అల్వాల్ లలో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. పటాన్ చెరువులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను కేబినెట్ మంజూరు చేసింది. అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లను ఇకనుంచి ‘‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)’’ గా పేరు పెట్టాలని నిర్ణయించారు. అలాగే.. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

Also read:

Tokyo Olympics 2020 Live: హి బింగ్‌ జియావో తో కాంస్య పతకం కోసం పోరాడుతున్న సింధు

JC Meets Raguveera: రఘువీరా రెడ్డితో, జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే..?

తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ దళాల వైమానిక దాడులు..250 మంది తాలిబన్ల మృతి.. 100 మందికి పైగా గాయాలు