JC Meets Raguveera: రఘువీరా రెడ్డితో, జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక భేటీ.. ఎందుకంటే..?
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి...
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆత్మీయంగా కలుసుకున్నారు. గ్రామంలో రఘువీరా కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన ఆలయాలను ఇద్దరూ కలిసి సందర్శించారు. అనంతరం స్వామివారి పూజ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయం మొత్తం తిరిగి కట్టడాలను పరిశీలించారు. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పార్టీలతో సంబంధం లేకుండా కీలక నాయకులను కలుస్తున్నానని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జెండాలు, అజెండాలు పక్కన బెట్టి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగస్థులతో కలసి ముందుకు సాగుతున్నానని చెప్పారు. అందులో భాగంగానే రఘువీరా రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. ఆయన నిర్మించిన దేవాలయాలను దర్శించుకున్నానని వెల్లడించారు. రాయలసీమ నీటి విషయంలో చేయాల్సిన పోరాటంపై నిర్ణయించుకున్న అజెండా గురించి ఆయనకు వివరించానని చెప్పారు. అంతా ఒక్క తాటిపైకి వచ్చి సీమ జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అతి త్వరలోనే రఘువీరా నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శత్రువులు ఉంటారు.. మిత్రులు ఉంటారని.. అయితే భవిష్యత్ తరాల కోసమే తాము కలిశామనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రిలో కేసు నమోదు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి రెండో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపిక సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. 153ఏ, 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ‘గ్రేట్ డాక్టర్’.. ఒక చేతికి సెలైన్ ఎక్కుతూనే ఉంది.. మరో చేత్తో చికిత్స సాగుతూనే ఉంది