TS Cabinet Meeting: ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఉద్యోగాల భర్తీపై చర్చ..

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. కృష్ణాజలాలు, ఉద్యోగాల భర్తీపై చర్చించనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

TS Cabinet Meeting: ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఉద్యోగాల భర్తీపై చర్చ..
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2021 | 2:24 PM

ప్రగ‌తి భ‌వ‌న్‌లో CM KCR అధ్యక్షత‌న తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు. 50 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.  ఈ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు.  వీలైనంత త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి KCR ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా సీమ ఎత్తిపోతలను అడ్డుకొనేందుకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇందులోభాగంగా భూముల విలువను సవరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిపై ఏర్పాటుచేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ కరోనా థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధతపై చర్చించనున్నది. వానకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు ఎంతమేరకు సిద్ధంగా ఉన్నాయి, కల్తీ విత్తనాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. జూలై 1నుంచి 10వ తేదీ వరకు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షిస్తారు.

ఇవి కూడా చదవండి: Yashpal Sharma: టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ కన్నుమూత.. భావోద్వేగానికి గురైన భారత క్రికెటర్లు

Sundar Pichai: నాలోనూ భారతీయత ఉంది.. సాంకేతిక అలవాట్లను షేర్ చేసిన గూగుల్ CEO సుందర్​ పిచాయ్