Balkampet Yellamma: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరుగుతోంది. కల్యాణమహోత్సవం సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరుగుతోంది. కల్యాణమహోత్సవం సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాటంతో పతిష్టమైన ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
కల్యాణం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచించారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనదారులు S.S బేకరీ దగ్గర నుంచి వెళ్లాలని చెప్పారు. అభిలాష టవర్స్, బీకే గూడ క్రాస్ రోడ్స్, బోగా రెసిడెన్సీ హోలీ క్రాస్ మీదుగా ఫతేనగర్ వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు.
ఫతేనగర్ నుంచి సత్యం థియేటర్ వైపు వెళ్లే వాహనదారులు బేగంపేట్ ఇనేట్ దగ్గర కొత్త బ్రిడ్జి వైపు వెళ్లాలన్నారు. బేగంపేట్ నుంచి బాలానగర్ వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ న్యూబ్రిడ్సి దగ్గర నుంచి బేగంపేట్, గ్రీన్ ల్యాండ్స్, లాల్ బంగ్లా, మాతా టెంపుల్ నుంచి సత్యం థియేటర్ వైపు అనుమతించనున్నారు. SR నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న రోడ్డును బంద్ చేయనున్నారు.