Telangana Politics: బీజేపీలో ఆ సీటు చాలా హాటు గురూ.. మరి ఎందుకంత ప్రత్యేకమో ఈ కథనంలో తెలుసుకోండి..
Telangana Politics: బీజేపీలో చాలా మంది ఆ హాట్ సీట్‌పై గురిపెట్టారు. దాదాపు ఏడెనిమిది మంది అక్కడి నుంచి బరిలో దిగేందుకు పావులు
Telangana Politics: బీజేపీలో చాలా మంది ఆ హాట్ సీట్‌పై గురిపెట్టారు. దాదాపు ఏడెనిమిది మంది అక్కడి నుంచి బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. ఇంతకీ కాషాయ నేతలు ఆ సీటుపై ఎందుకు ప్రేమ పెంచుకున్నారు? ఇంతకీ ఆ హాటు సీటు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం చాలా హాటు సీటుగా మారింది. కాషాయ నేతలు చాలా మంది ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. జాక్‌పాట్ సీటును కైవసం చేసుకోవడానికి వ్యూహరచన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గం చాలా విభిన్నమైంది. ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం.. అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న సమతాస్ఫూర్తి కేంద్రం.. వ్యవసాయ విశ్వవిద్యాలయం.. అవుటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న కాస్ట్‌లీ ఏరియా.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అగ్రభాగన ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గంపై కాషాయ నేతల కన్ను పడింది.
2018 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన బద్దం బాల్‌రెడ్డి మరణించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ రాజేంద్రనగర్ నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయనపై వ్యతిరేకత, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు ఎంఐఎం నియోజకవర్గంలో బలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఈ అంశాలు కలిసి వస్తాయని కమలనాథులు నమ్ముతున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగ్గ క్యాడర్ ఉందనే చెప్పుకోవచ్చు. GHMC పరిధిలో ఉన్న 5 డివిజన్లు ఈ నియజకవర్గంలో ఉన్నాయి. అందులో మూడు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక మిగతా రెండు స్థానాల్లో ఎంఐఎం భారీ విజయం నమోదు చేసుకుంది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్‌తో పాటు మణికొండ, నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తోకల శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీ నుంచి కార్పోరేటర్‌గా గెలిచారు. ఈ సారి బీజేపీ టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. నార్సింగి మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను బీజేపీలో చేర్పించారు. స్వచ్చంధ సంస్థ ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు తోకల శ్రీనివాస్ రెడ్డి. రాజేంద్రనగర్ సీటుపై పాత బీజేపీ నేతలు కూడా భారీగానే ఆశలు పెంచుకున్నారు. బీజేపీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్‌జీ శిష్యుడిగా ఉన్న బొక్కా బాల్‌రెడ్డి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో బద్దం బాల్‌రెడ్డి కోసం టికెట్ వదులుకున్నానని బొక్కా బాల్‌రెడ్డి చెబుతున్నారు.
ఇక శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీ అని ప్రకటించారు. బీజేపీకి చెందిన మరోనేత బొక్క వేణుగోపాల్ కూడా రాజేంద్రనగర్ బీజేపీ సీటు దక్కించుకోవాలని ఆశపడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ది తనది ఒకటే సామాజిక వర్గమని, తనకే టికెట్ దక్కుతుందని బొక్కా వేణుగోపాల్ చెప్పుకుంటున్నారు. శంషాబాద్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ప్రేంరాజ్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మణికొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నరేందర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. లోకల్ పాలిటిక్స్ ఇలా ఉండగా.. రాష్ట్ర స్థాయి నేతలు ఇక్కడి నుంచి బరిలో దిగేతే ఎలా ఉంటుందనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శాస్త్రీపురంలో నివాసం ఉంటారు. అసద్ నివాసం ఉండే ఇలాకాలో ఎంఐఎంపై సవాల్ విసిరి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై బీజేపీ అగ్ర నేతలు ఆలోచన చేస్తున్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి, డీకే అరుణలాంటి నేతలు నేరుగా ఇక్కడి నుంచి బరిలో దిగే ఛాన్స్ కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.
Also read:
Olympic Doping Scandal: ముదురుతున్న రష్యన్ స్కేటర్ వలియేవా డోపింగ్ వివాదం.. భవిష్యత్ ఏంటో అని..
Viral Video: దున్నపోతుతో ఇట్లానే ఉంటుంది మరీ.. వైరల్ వీడియో..
చేతుల్లో భోజనం ప్లేట్స్ పెట్టుకొని శ్రీవల్లి హూక్ స్టెప్ !! అదరగొట్టారు.. వీడియో