Bandi Bhageerath: పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
Bandi Bhageerath: పోలీసుల ఎదుట బండి భగీరథ్ లొంగిపోయారు. లైంగిక వేధింపుల కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. అయితే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం పోలీసులు ఇప్పటికే వెతుకున్నారు. నాలుగు బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు.. తాజాగా..

Bandi Bhageerath: తెలంగాణ పోలీసుల ఎదుట బండి భగీరథ్ లొంగిపోయారు. లైంగిక వేధింపు కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో భగీరథ్ కోసం పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపడుతుండగా, భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు.
కేసు నమోదైన తర్వాత పోలీసులు కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్‌లో బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాకుండా ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని బండి సంజయ్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. భగీరథ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నవారి వివరాలను సేకరించారు. అయితే తాజాగా న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ లొంగిపోయారు.
భగీరథ్‌ను నేనే అప్పగించా- బండి సంజయ్
అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులకు అప్పగించామన్నారు. లాయర్ల సమక్షంలోనే పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఆధారాలు చూపేందుకు అప్పగింతలో జాప్యం జరిగిందని, ఏ తప్పూ చేయలేదని భగీరథ్ అంటున్నాడని అన్నారు. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు.
