విపక్షాల ‘మూటల’ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణలో ప్రజా పాలనపై విపక్షాలు చేస్తున్న దోపిడీ పాలన ఆరోపణలను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన 'క్రాస్‌ఫైర్' ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, విపక్షాల విమర్శలపై తనదైన శైలిలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ప్రజా పాలనపై విపక్షాలు చేస్తున్న దోపిడీ పాలన ఆరోపణలను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, విపక్షాల విమర్శలపై తనదైన శైలిలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ కాంగ్రెస్ నుంచే డబ్బులు వెళ్తాయని, ఆ మూటలను పొంగులేటి శ్రీనివాసరెడ్డే స్వయంగా తీసుకెళ్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. “నా దగ్గర ఎలాంటి డబ్బుల మూటలు లేవు, నేను ఎక్కడికీ మోసుకెళ్లడం లేదు” అని ఆయన తేల్చిచెప్పారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే విపక్షాలు ఇలాంటి నిరాధారమైన, బురదజల్లే రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజల సంక్షేమం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ‘ప్రజా పాలన’ అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూనే, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, అసత్య ప్రచారాలు సాగించినా ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, తమ ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిని విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
