AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే మామిడి కాయ పాలకూర కలిపి పప్పు.. అబ్బా ఒక్క ముద్ద తిన్నా చాలు, జన్మధన్యం

ఎండకాలం వచ్చిందంటే చాలు రకరకాల మామిడికాయ వంటకాలు గుర్తొస్తాయి. ఎప్పుడూ చేసే మామిడికాయ పప్పు కాకుండా, ఈసారి ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూరను కలిపి 'మామిడికాయ పాలకూర పప్పు' చేసి చూడండి. పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ పప్పు తయారీ విధానం మరియు చిట్కాలు ఈ కథనంలో మీకోసం.

Phani CH
|

Updated on: May 16, 2026 | 7:27 PM

Share
మన తెలుగు వారి ఇళ్లల్లో మధ్యాహ్నం భోజనంలో పప్పు లేకపోతే ముద్ద దిగదు. అందులోనూ వేసవి కాలం వచ్చిందంటే చాలు, పచ్చి మామిడికాయలతో చేసే వంటకాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా మనం మామిడికాయ పప్పు లేదా పాలకూర పప్పు విడివిడిగా చేసుకుంటూ ఉంటాం.

1 / 6
కానీ, పాలకూర, మామిడికాయ కలిపి వండితే వచ్చే రుచే వేరు. పుల్లని మామిడికాయ ముక్కలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర కలయికలో తయారయ్యే 'మామిడికాయ పాలకూర పప్పు' చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, ఈ పప్పుతో తింటుంటే ఆ తృప్తే వేరు. దీనికి కాంబినేషన్‌గా ఏదైనా కూర తాలింపు లేదా సింపుల్‌గా అప్పడాలు నంచుకున్నా సరే అమృతంలా అనిపిస్తుంది. బ్యాచిలర్స్ సైతం ఎంతో సులువుగా చేసుకునేలా ఈ పప్పు తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

2 / 6
ఈ కమ్మని పప్పు కోసం ముందుగా నాలుగు కట్టల తాజా పాలకూరను తీసుకుని శుభ్రంగా కడిగి, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు పుల్లటి మామిడికాయను తీసుకుని, తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ పులుపును బట్టి ముక్కల పరిమాణాన్ని అడ్జస్ట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఒక కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి, అందులో రెండు కప్పుల నీళ్లు పోయాలి.

3 / 6
ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర, మామిడికాయ ముక్కలు, ఒక పది పచ్చిమిరపకాయల ముక్కలు, అర చెంచా పసుపు, ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. పప్పు త్వరగా ఉడకడం కోసం ఉప్పును ఇప్పుడే వేయకూడదు. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెజర్ తగ్గాక మూత తీసి, రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి.

4 / 6
పప్పు రుచిని రెట్టింపు చేసేది దాని తాలింపే. ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి, అందులో రెండు చిటికెల మెంతులు, ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు) వేసి వేయించాలి. మెంతులు కాస్త ఎర్రగా వేగితేనే మంచి సువాసన వస్తుంది.

5 / 6
ఆ తర్వాత ఎండుమిర్చి, రెండు చిటికెల ఇంగువ, కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు తాలింపులో ఇలా వేగితే పప్పుకు అద్భుతమైన రుచి వస్తుంది. చివరగా కరివేపాకు వేసి, ఎనిపి పెట్టుకున్న పప్పును ఈ తాలింపులో పోసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసాక కొత్తిమీర, పైనుంచి ఒక చెంచా నెయ్యి వేసి ఐదు నిమిషాలు మూత పెడితే గుమగుమలాడే మామిడికాయ పాలకూర పప్పు సిద్ధమవుతుంది.

6 / 6
Follow Us