జగపతి బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే
16 May 2026
Pic credit - Instagram
Phani Ch
ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది మహిళా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న టాలీవుడ్ హీరో జగపతి బాబు పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తనదైన ముద్ర వేసిన జగపతి బాబు త్వరలోనే "వదలా" అనే ఒక విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో జగ్గూభాయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అందులో ఆయన తన చిన్ననాటి మొదటి క్రష్ గురించి బయటపెట్టారు. జగపతి బాబు చెన్నైలో ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఒకరిపై మనసు పడ్డారట.
అయితే విచిత్రం ఏంటంటే ఆ ఇష్టం తన క్లాస్‌మేట్ మీదనో, లేదా స్కూల్ లోని మరేదైనా సీనియర్ అమ్మాయి మీదనో అస్సలు కాదట.
ఆయనకు స్కూల్ లో పాఠాలు చెప్పే ఒక తమిళ్ టీచర్ మీద క్రష్ ఉండేదట. ఆమె రోజూ తలలో అందమైన మందార పువ్వు పెట్టుకుని, కొప్పుతో ఎంతో సాంప్రదాయంగా స్కూల్‌కు వచ్చేదట.
ఆ తమిళ్ టీచర్ అంటే కలిగిన ఇష్టం కేవలం కొన్ని రోజులతోనే అయిపోలేదు. దాదాపు ఆరు నుండి ఏడు సంవత్సరాల పాటు ఆమెపై ఆ క్రష్ అలాగే కొనసాగిందట.
కానీ ఆ వయసులో అది ఎలాంటి ఇష్టమో కూడా ఆయనకు సరిగ్గా తెలియదట. అలా కాలం గడిచిపోయింది, ఆయన సినిమాల్లోకి వచ్చి హీరోగా మారి పెద్ద సక్సెస్ సాధించి మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు.