Ponguleti Srinivas Reddy: 30 శాతం కమీషన్ తీసుకునేది మేము కాదు వాళ్లే – మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Ponguleti Srinivas Reddy: సైకిల్ మీద తిరిగిన వాళ్లకు లక్షల కోట్లు ఎలా వచ్చాయని పొంగులేటి ప్రశ్నించారు. భూములు దోచుకోవడం కోసమే ధరణి తెచ్చారని మండిపడ్డారు. అవినీతిని బయటకు తీస్తుంటే కోర్టుల్లో స్టే తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. అలాగే తమ ప్రభుత్వంలో

Ponguleti Srinivas Reddy: వివిధ రకాల పనులకు తాము 30 శాతం కమీషన్ తీసుకునేది తాము కాదని, వాళ్లే నంటూ చెప్పుకొచ్చారు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాము ఎక్కడైన కమీషన్లు తీసుకున్నట్లు ఉంటే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో పొంగులేటి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ సహా చాలా బయటకొచ్చాయని, BRSకు కాళేశ్వరం ఏటీఎం అంటూ మోదీ సహా బీజేపీ పెద్దలు చెప్పారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, ఈ కారణంగానే కాళేశ్వరంపై సీబీఐ విచారణను పక్కనబెట్టారని అన్నారు. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, లక్ష రుణమాఫీ చేయడానికి గత ప్రభుత్వానికి పదేళ్లు పట్టిందని, ఇప్పటికే 71వేల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు.
అలాగే త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు వేయన్నామని మంత్రి తెలిపారు. మా రెండేళ్ల పాలనకు 75శాతం మార్కులు వచ్చాయన్న పొంగులేటి.. ఉప ఎన్నికల్లో గెలుపే మా పాలనకు మార్కులు అని అన్నారు. మూటలకు మహారాజులు వాళ్లే, మూటల సంస్కృతి వాళ్లదేనని, మహరాష్ట్ర, కర్నాటక, ఏపీ సహా పలు రాష్ట్రాలకు BRS డబ్బులు పంపిందని విమర్శించారు.
సైకిల్ మీద తిరిగిన వాళ్లకు లక్షల కోట్లు ఎలా వచ్చాయని పొంగులేటి ప్రశ్నించారు. భూములు దోచుకోవడం కోసమే ధరణి తెచ్చారని మండిపడ్డారు. అవినీతిని బయటకు తీస్తుంటే కోర్టుల్లో స్టే తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. అలాగే తమ ప్రభుత్వంలో ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది సీఎం ఇష్టమని, పార్టీ ఇష్టం అని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
